ఎక్కువ కష్టపడాల్సిన పనిలేదు..సింపుల్‌గా 30 సెకన్లలో వెల్లుల్లి పొట్టు తీసే సూపర్ ట్రిక్! మీ కోసమే..

Updated on: Jul 18, 2026 | 7:18 PM

వంట చేసేటప్పుడు వెల్లుల్లిపాయల పొట్టు తీయడం చాలా మందికి పెద్ద సవాలుగా అనిపిస్తుంది. గోళ్లతో లేదా చాకుతో ఒలిచేటప్పుడు వేళ్లు నొప్పి పుట్టడం, చేతులకు వెల్లుల్లి వాసన పట్టడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ఏ విధమైన చాకు లేదా ఖరీదైన వంటగది సాధనాలు లేకుండా కేవలం 30 సెకన్లలో వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించే ఒక అద్భుతమైన దేశీ చిట్కా అందుబాటులోకి వచ్చింది.అదేంటంటే..

1 / 5
భారతీయ వంటకాల్లో వెల్లుల్లికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది వంటకాలకు అద్భుతమైన రుచిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే, వంట చేసేటప్పుడు వెల్లుల్లి రెబ్బల పొట్టు తీయడం మాత్రం చాలా మందికి అత్యంత విసుగు పుట్టించే పని. వెల్లుల్లి రెబ్బలు చిన్నగా ఉండటం వల్ల వాటి పొట్టు తీయడానికి సమయం ఎక్కువగా పడుతుంది. చాలా మంది గోళ్లతో లేదా చాకుతో ఒలవడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల వేళ్లు నొప్పి పుట్టడమే కాకుండా, చేతులకు ఆ ఘాటైన వాసన రోజు మొత్తం అలాగే ఉండిపోతుంది. ఒకవేళ మీరు కూడా ప్రతిరోజూ ఈ సమస్యను ఎదుర్కొంటుంటే, వంటగదిలో పనిని సులభం చేసే ఒక అద్భుతమైన చిట్కా ఇప్పుడు మీకోసం.

2 / 5
ఈ సులువైన దేశీ చిట్కా కోసం మీకు ఎలాంటి చాకు గానీ, మార్కెట్లో దొరికే ఖరీదైన కిచెన్ గ్యాడ్జెట్స్ గానీ అవసరం లేదు. కేవలం ఒక మూత ఉన్న ప్లాస్టిక్ డబ్బా లేదా రెండు స్టీల్ గిన్నెలు ఉంటే సరిపోతుంది. ముందుగా వెల్లుల్లిపాయ నుండి రెబ్బలను విడివిడిగా వేరు చేసుకోండి. ఆ రెబ్బలన్నింటినీ ఒక మూత ఉన్న డబ్బాలో వేసి, మూతను గట్టిగా బంద్ చేయండి. ఒకవేళ డబ్బా లేకపోతే, ఒక స్టీల్ గిన్నెలో వెల్లుల్లి రెబ్బలు వేసి, దానిపై మరో గిన్నెను బోర్లించి గట్టిగా పట్టుకోవాలి.

3 / 5
ఇప్పుడు ఆ డబ్బాను లేదా గిన్నెలను కనీసం 20 నుండి 30 సెకన్ల పాటు చాలా వేగంగా, గట్టిగా ఊపాలి. ఫలితం చూసి ఆశ్చర్యపోతారు. మీరు 30 సెకన్ల పాటు గట్టిగా ఊపిన తర్వాత మూత తీసి చూస్తే ఆశ్చర్యపోవడం మీ వంతు అవుతుంది.

4 / 5
 గిన్నె లేదా డబ్బా లోపల వెల్లుల్లి రెబ్బలు ఒకదానికొకటి, గోడలకు బలంగా ఢీకొట్టడం వల్ల వాటిపై ఉన్న పొట్టు పూర్తిగా విడిపోతుంది. దాదాపు 90 శాతం పైగా వెల్లుల్లి రెబ్బలు పూర్తిగా వలిచినట్లుగా బయటకు వస్తాయి. ఒకవేళ కొన్నింటికి పొట్టు మిగిలి ఉన్నా, అది చాలా వదులుగా మారిపోతుంది కాబట్టి చేత్తో తాకగానే ఊడిపోతుంది.

5 / 5
ఈ ట్రిక్ వల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా చేతులకు వెల్లుల్లి వాసన అంటదు. ప్రతిరోజూ వంటగదిలో గంటల కొద్దీ శ్రమను తగ్గించుకోవడానికి, ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకోవాలనుకునే వారికి ఈ చిట్కా ఒక వరమనే చెప్పాలి.

Follow Us