గజలక్ష్మీ రాజయోగం.. మరో రెండు రోజుల నుంచి వీరికి అదృష్టమే!

Updated on: Jul 24, 2025 | 2:05 PM

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయిక వలన శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడుతుంటాయి. అయితే ఈ సారి శ్రావణ మాసంలో ఎంతో శక్తి వంతమైన గజలక్ష్మీ రాజయోగం ఏర్పడ నుంది. దీని వలన నాలుగు రాశుల వారికి అఖండ రాజయోగం ఏర్పడుతుంది. కాగా ఆ రాశులు ఏవి? ఏ రాశుల వారికి శ్రావణ మాసం అద్భుతంగా కలిసి వస్తుందో ఇప్పుడు చూద్దాం.

1 / 5
 జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే జులై 26వ తేదీన శుక్రుడు వృషభరాశి నుంచి మిథున రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అలాగే ఇప్పటికే మిథున రాశిలో బృహస్పతి  కూడా సంచార దశలో ఉండడం వల్ల ఈ రెండు గ్రహాల కలయికతో శ్రావణ మాసంలో గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. దీని వలన నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది.

2 / 5
మేష రాశి : గజలక్ష్మీ రాజయోగం వలన ఈ రాశి వారికి అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీ దేవి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారమే కానుంది. అంతే కాకుండా వీరు శ్రావణ మాసంలో ఎప్పుడూ చాలా ఆనందంగా ఉంటారు. విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. ఏ పని చేసినా వీరికి కలిసి వస్తుందంట.

3 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి గజలక్ష్మీ రాజయోగం వలన ఏ పనుల్లో నైనా విజయం వీరి సొంతం అవుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులకు, వ్యాపారస్తులకు, కళారంగంలో ఉన్నవారికి అద్భుతంగా ఉంటుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

4 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి గజలక్ష్మీ రాజయోగం వలన పనుల్లోని ఆటంకాలు తొలిగిపోతాయి. ఆర్థికంగా కలిసివస్తుంది. చాలా రోజుల నుంచి వసూలు కాని మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు, వ్యాపారస్తులకు కలిసి వస్తుంది.

5 / 5
తుల రాశి : తుల రాశి వారు గజలక్ష్మీ రాజయోగం వలన జీవితంలో త్వరగా విజయాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులకు అద్భుతంగా ఉంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు కలిసి వస్తాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు అత్యధిక లాభాలు పొందుతారు.