తిరుమల శ్రీవారికి ఖరీదైన కానుక.. కోట్ల విలువైన వైజయంతీ మాల.. చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు..!

| Edited By: Shaik Madar Saheb

Nov 14, 2024 | 2:36 PM

తిరుమల శ్రీవారి ఆభరణాల్లో మరో ఖరీదైన హారం వచ్చి చేరింది. టీటీడీ మాజీ చైర్మన్ డికె ఆదికేశవ నాయుడు మనవరాలు చైతన్య తిరుమల శ్రీవారికి భారీగా బంగారు కానుకలు సమర్పించారు. తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవార్లకు వైజయంతి మాలను సమర్పించారు. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారికి కూడా మరో వైజయంతీ మాలను శుక్రవారం రోజు కానుకగా అందజేయనున్నారు.

1 / 7
తిరుమల వెంకన్నకు టీటీడీ మాజీ ఛైర్మన్ డీకే ఆదికేశవులు నాయుడు కుమార్తె తేజస్విని, మనవరాలు చైతన్య దాదాపు రూ.2 కోట్ల విలువైన వజ్రవైడుర్యాలు పొదిగిన స్వర్ణ వైజయంతీ మాలను కానుకగా అందజేశారు. తేజస్వి, చైతన్యలు ఈ మాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు దంపతుల చేతుల మీదుగా టీటీడీకి అందించారు.

2 / 7
శ్రీహరి ఆలయంలో టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు చేతుల మీదుగా తల్లితో కలిసి శ్రీవారికి కానుకను సమర్పించారు దాత తేజస్విని. సుమారు రూ 2 కోట్లు విలువైన స్వర్ణ  వైజయంతీ మాలను విరాళమిచ్చిన డికే ఆదికేశవులు మనవరాలు తేజస్వీ తల్లితో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి వేద ఆశీర్వచనాలు అందజేశారు.

3 / 7
రూ.2 కోట్ల విలువైన వజ్రవైడుర్యాలు పొదిగిన స్వర్ణ వైజయంతి మాలను శ్రీవారికి కానుకగా ఇచ్చారు. వైజయంతీ మాలను టిటిడి ఉత్సవమూర్తులకు అలంకరించనుండగా, శుక్రవారం తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారికి కూడా మరో వైజయంతీ మాలను కానుకగా సమర్పించనున్నారు.

4 / 7
సుమారు రూ 2 కోట్లు విలువైన స్వర్ణ  వైజయంతీ మాలను విరాళమిచ్చిన డికే ఆదికేశవులు మనవరాలు చైతన్య.. ఆమె తల్లి తేజస్వీనితో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.

5 / 7
దాదాపు రూ.2 కోట్ల విలువైన వజ్రవైడుర్యాలు పొదిగిన స్వర్ణ వైజయంతీ మాలను కానుకగా అందజేశారు. తేజస్వి, చైతన్యలు ఈ మాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు దంపతుల చేతుల మీదుగా టీటీడీకి అందించారు.

6 / 7
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో డీకే ఆదికేశవులు నాయుడికి సీనియర్ రాజకీయ నేతగా గుర్తింపు ఉంది. ఆయన 2004లో చిత్తూరు ఎంపీగా టీడీపీ నుంచి గెలిచారు.. అయితే కొన్ని రాజకీయ పరిణామాలతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత టీటీడీ ఛైర్మన్‌గా పనిచేశారు.. ఆయన 2013లో కన్నుమూశారు.

7 / 7
డీకే ఆదికేశవులు నాయుడు మనవరాలు చైతన్య ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో ఆమె పోటీ చేయాలని భావించారు.. కానీ కొన్ని పరిణామాలతో సాధ్యపడలేదని సమాచారం.. ఆమె ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారంలో మాత్రం చురుగ్గా పాల్గొన్నారు.