
కొత్తిమీర రోటి పచ్చడి కావలసిన పదార్థాలు: రెండు కట్టల కొత్తిమీర , 4 పచ్చిమిర్చి , 4 వెల్లుల్లి రెబ్బలు, రెండు టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, 2 టేబుల్ స్పూన్లు నూనె, అర కప్పు చింతపండు రసం, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా రెండు గ్లాసుల నీళ్లు తీసుకోవాలి.

కొత్తిమీరను ఇలా రెడీ చేసుకోవాలి: ముందుగా కొత్తిమీరను నీటితో బాగా కడిగి వాటిని వడగట్టి చిన్నగా కట్ చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇంకా చెత్త, మట్టి లేకుండా వాటిని బాగా క్లీన్ చేసుకోవాలి. ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే, ఇది పచ్చడి రుచిని పెంచుతుంది. కాబట్టి, మీరు కూడా ఫాలో అవ్వండి

వీటిని ఇలా రోటిలో బాగా నూరుకోవాలి: ఇప్పుడు రోటిలో నాలుగు పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు , పుట్నాలు వేసి దంచుకోవాలి. ఆ తరవాత ముందుగా పక్కన పెట్టుకున్న కొత్తిమీర, నిమ్మకాయంత చింతపండు, రుచికి తగినంత ఉప్పును కూడా వేసి దీనిని బాగా నూరుకోవాలి. ఇంకా దీనిలో కొద్దిగా నీరు పోసి పేస్ట్‌లాగా చేసుకోవాలి.

చివర్లో ఈ మిశ్రమాన్ని తాలింపు పెట్టుకోవాలి: గ్యాస్ వెలిగించి దానిలో నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు కరివేపాకు ఆకులు బాగా వేయించాలి. ఆ తరవాత పచ్చడిపై దీనిని పోయాలి. ఇది పచ్చడి రుచిని మరింత పెంచుతుంది. తాలింపు పెట్టకపోయినా కూడా పచ్చడి టేస్టీగా ఉంటుంది.

వేడి వేడి అన్నం, దోసె, ఇడ్లీ: ఈ కొత్తిమీర రోటి పచ్చడిని వేడి వేడి అన్నం, దోసె, ఇడ్లీలోకి అదిరిపోతోంది. అప్పటికప్పుడు దీనిని చేసుకుని తింటే ఇది మరింత రుచిగా ఉంటుంది. విపరీతంగా వేడి చేసి యూరిన్ రానివాళ్ళు కూడా దీనిని తింటే చాలు ఆ సమస్య తగ్గిపోతోంది. ఇంకా మండే ఎండల్లో బెస్ట్ ఫుడ్.