
మనం అంటే చేపలను అల్లం, వెల్లుల్లి పేస్ట్ తో చేసుకుంటాము. మత్స్యకారుల ఇళ్లలో పుల్లగా కారంగా వండుకుంటారు. కాకపోతే మన కూరకు వాళ్ళ కూరకు చాలా తేడా ఉంది. అయితే, వాళ్లు కూరల్లో ఏం వేసుకుంటారో వివరంగా చూద్దాం అసలు లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారి విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం..

చేపల పులుసు రెసిపీకి కావలసిన పదార్థాలు : అర కిలో చేప ముక్కలు, రెండు ఉల్లిపాయలు, రెండు టమాటాలు, నాలుగు పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, ఒక టేబుల్ స్పూన్ అల్లం–వెల్లుల్లి పేస్ట్, రెండు టేబుల్ స్పూన్ కారం పొడి, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ పసుపును తీసుకోవాలి. దీనిని సరైన కొలతలతో చేస్తే స్పైసీగా ఉంటుంది.

చేపల పులుసు రెసిపీకి కావలసిన పదార్థాలు : అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అర టేబుల్ స్పూన్ మెంతులు, అర టేబుల్ స్పూన్ ఆవాలు, నాలుగు కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, నాలుగు టేబుల్ స్పూన్స్ నువ్వుల నూనె, తగినంత నీరును తీసుకోవాలి.

చేపల పులుసు రెసిపీ తయారి విధానం: ముందుగా చేప ముక్కలను తీసుకుని ఒకసారి పసుపు, ఉప్పుతో బాగా కడిగి 20 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఇంకా వాళ్లు ఈ కూరను మట్టి పాత్రలో చేస్తారు అందుకే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా దీనిలో కొద్దిగా ఆవాలు, కరివేపాకు, కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేస్తారు. ఉల్లిపాయలు, అల్లం–వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి.

ఇంకా దీనిలో టమాటాలు , ఒక టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. ఇంకా కొద్దిగా చింతపండు రసం, తగినంత నీరు పోసి 5 నిమిషాల పాటు మరిగించాలి. చివర్లో చేప ముక్కలు వేసి 10 నిమిషాలు పాటు బాగా ఉడికించాలి. దించే ముందు కొత్తిమీర వేసి వడ్డించుకుని తినడమే.