క్యాబేజీ అనగానే ముఖం చిట్లిస్తున్నారా.. ఈ ప్రయోజనాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

|

Dec 11, 2022 | 7:02 PM

మనం ఆరోగ్యంగా ఉండేందుకు సమతుల ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం కూరగాయలు, పప్పుధాన్యాలు, మాంసం, పాలు, పండ్లు.. ఇలా ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ప్రకృతి మనకు అందించిన పోషకాల సమ్మేళనాలు. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది క్యాబేజీ గురించి. చాలా మంది క్యాబేజీ తినేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు. కానీ దీనిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం తినకుండా అస్సలు ఉండలేరు.. ...

1 / 5
క్యాబేజీ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. లేత ఆకుపచ్చ లేదా ఆకుపచ్చని రంగులో ఉండే క్యాబేజీని మార్కెట్లో సులభంగా కనిపెట్టవచ్చు. క్యాబేజీలోని ప్రతి రకం మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగానే ఉంటుంది. క్యాబేజీ మధుమేహం సమస్యతో బాధపడేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే లక్షణాలు ఇన్సులిన్ స్థాయిని పెంచడంలో, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి.

2 / 5
క్యాబేజీ జీర్ణక్రియకు కూడా చాలా మేలు చేస్తుంది. క్యాబేజీలో పెద్ద మొత్తంలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. క్యాబేజీలో ఉండే పాలీఫెనాల్స్, ఆంథోసైనిన్లు జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడతాయి. క్యాబేజీ మన గుండెకు కూడా మేలు చేస్తుంది. క్యాబేజీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి

3 / 5
 క్యాబేజీని తీసుకోవడం వల్ల గుండె ఒత్తిడి తగ్గుతుంది ఇంకా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్యాబేజీ ఉదర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది మీ జీర్ణశక్తిని పెంచి కడుపు నొప్పిని దూరం చేస్తుంది. దీన్ని తినడం వల్ల కడుపులో నులిపురుగుల సమస్య కూడా నయమవుతుంది.

4 / 5
కండరాల నొప్పులతో బాధపడుతున్నట్లయితే క్యాబేజీ మంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో లాక్టిక్ యాసిడ్ అనే మూలకం ఉంటుంది. ఇది సహజ నొప్పి నివారిణిగా పని చేస్తుంది. క్యాబేజీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది.

5 / 5
బరువు తగ్గాలనుకునే వారు క్యాబేజీని ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉడికించిన క్యాబేజీలో 33 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇది మీ శరీరానికి పుష్కలంగా శక్తిని ఇస్తుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. సూప్, కూరగాయలు, సలాడ్ రూపంలో తీసుకోవచ్చు.