
గసగసాలు మన ఆరోగ్యానికి అనేక రకాలుగా ఉపయోగపడతాయి. కొందరు వీటిని పేస్ట్ లా చేసుకుని వేడి వేడి పాలలో కూడా దీనిని కలిపి తీసుకుంటారు ఇంకా మంచి గాఢమైన నిద్ర వస్తుంది. ఇంకా వీటి వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ఎముకల బలం: ఈ గస గసాలలో ఉండే కాల్షియం, మెగ్నీషియం విరిగిన ఎముకలు బలపడేలా చేస్తాయి. ఇంకా ఆస్టియోపోరోసిస్ రాకుండా మిమ్మల్ని కాపాడతాయి. ఇప్పటికి నాన్ వెజ్ కూరల్లో ఇవి పక్కాగా వేసుకుని వండుకుంటారు. అయితే, వీటిని ముందుగా నీటిలో నానాబెట్టుకుని కూరల్లో వేసుకోవాలి అప్పుడే మంచి రుచి వస్తుంది.

జీర్ణక్రియ, మలబద్ధకం : గస గసాలలో ఉండే ఉండే ఫైబర్ జీర్ణక్రియ పనితీరును ఇది మెరుగుపరుస్తుంది. ఇంకా మలబద్ధకాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. కాబట్టి, మీరు వారంలో రెండు సార్లు వీటిని తీసుకుంటే చాలు. ఈ సమస్య నుంచి ఈజీగా బయట పడొచ్చు. ఇప్పటి నుంచి దీనిని మీరు అలవాటు చేసుకోండి.

శరీర వేడి, అల్సర్ : మీరు ఈ గసగసాలను వేయించి పంచదారతో తీసుకుంటే మీ కడుపులో మంట, ఎసిడిటీ , అల్సర్లు కూడా తగ్గుతాయి. ఆ తరవాత మీ బాడీ మొత్తం కూడా చల్ల బడుతుంది. కాబట్టి, మీరు వీటిని తీసుకుంటూ ఉండండి. శరీరంలో వేడి తగ్గాలంటే ఇదొక్కటే మార్గం.

ఇవి ఏ కిరాణా షాపుల్లో అయినా ఇవి ఈజీగా దొరుకుతాయి. (నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు)