అనుకోకుండా వచ్చే అతిథుల కోసం అద్భతమైన స్వీట్.. నోట్లే వేస్తే జారిపోతది

Updated on: Jul 02, 2026 | 6:37 PM

స్వీట్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఎత ఇష్టంగా స్వీట్ చేసుకొని తింటారు. అయితే అప్పుడు ఇంటికి అనుకోని అతిథులు వస్తుంటారు. అయితే వారి చాలా వరకు స్వీట్ పెడుతుంటారు. కానీ కొన్ని సార్లు బయట కొనుగోలు చేయడం కంటే ఇంటిలో చేసి ఇవ్వడమే చాలా మంచిగా ఉంటుంది. అందుకోసమే మనం ఇప్పుడు ఇంటికి వచ్చే అథితుల కోసం నిమిషాల్లో తయారు చేయగలిగే, అద్భుతమైన స్వీట్ రెసిపీ. దీనిని ఎలా చేయాలో చూద్దాం.

1 / 5
కావాల్సిన పదార్థఆలు : కొబ్బరి తురుము: 1/2 కప్పు,   మైదా పిండి లేదా గోధుమ పిండి: 1 కప్పు,  పంచదార (స్టఫింగ్ కోసం): 1 స్పూన్,పంచదార (పాకం కోసం): 1/2 కప్పు నుండి 3/4 కప్పు వరకు,  నీళ్లు (పాకం కోసం): 1 కప్పు,   నెయ్యి,2 స్పూన్లు (ఒకటి స్టఫింగ్ కోసం, ఒకటి పిండి కోసం),   డ్రై ఫ్రూట్స్ (జీడిపప్పు, బాదం,యాలకుల పొడి: 1/4 స్పూన్,   ఉప్పు,చిటికెడు,  నూనె: వేయించడానికి సరిపడా.

2 / 5
తయారీ విధానంలోకి వెళితే..ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకోండి. అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి కరిగించుకోండి. నెయ్యి కరిగిన తరువాత, మీ ఇంట్లో ఉన్న జీడిపప్పు, బాదం వంటి డ్రై ఫ్రూట్స్ వేసి దోరగా వేయించి ఒక బౌల్లోకి తీసుకోండి.అదే నెయ్యిలో 1/2 కప్పు కొబ్బరి తురుమును వేసి, పచ్చివాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి ఏదైనా వాడుకోవచ్చు. కొబ్బరి బాగా ఫ్రై అయిన తరువాత, ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, 1/4 స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలపండి. చివరగా ఒక్క స్పూన్ నీళ్లు వేసి, నీళ్లన్నీ కొబ్బరిలో కలిసిపోయేంతవరకు కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి.

3 / 5
ఇప్పుడు పిండి తయారు చేసుకోవాలి. దీని కోసం ఒక  మిక్సింగ్ బౌల్ల్ తీసుకొని, అందులో ఒక కప్పు మైదా పిండి లేదా గోధుమ పిండిని తీసుకోండి. రుచికి తగ్గట్టుగా చిటికెడు ఉప్పు, ఒక స్పూన్ నెయ్యి  వేసి బాగా కలపండి. పిండిలో నెయ్యి బాగా కలిసిన తరువాత, కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా మెత్తగా, స్మూత్ గా కలుపుకోవాలి. పిండి బాగా కలిపిన తరువాత, పైన ఒక స్పూన్ నూనె వేసి మళ్ళీ బాగా కలిపి, మూత పెట్టి పక్కన పెట్టండి. పిండి ఆరిపోకుండా ఉంటుంది.

4 / 5
 ఇప్పుడు పంచదారా పాకం తయారు చేసుకోవాలి. దీని కోసం మరొక స్టవ్ మీద బాండీ పెట్టి, ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు నుండి 3/4 కప్పు వరకు పంచదార వేసుకోండి. పంచదార బదులు బెల్లాన్ని కూడా వాడుకోవచ్చు. ఒక కప్పు నీళ్లు పోసి, పంచదార పూర్తిగా కరిగేంతవరకు కలుపుకోండి. పాకం కాస్త జిగురుగా మారగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. తీగపాకం అవసరం లేదు.

5 / 5
ఇప్పుడు పిండితో పూరీల మాదిరి చేసుకోవాలి. తర్వాత మధ్యలో కొబ్బరి స్టఫింగ్ పెట్టి, మంచిగా ఫోల్డ్ చేయాలి, తర్వాత బొబ్బట్లా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నూనె వేసి, వాటిని మంచిగా కాల్చుకోవాలి. తర్వాత వీటిని  ముందుగా సిద్ధం చేసుకున్న గోరువెచ్చని పంచదార పాకంలో వేయండి. రెండు నిమిషాలు అటూ ఇటూ తిప్పుతూ పాకం స్వీట్లకు పట్టేలా చూడండి. పాకం బాగా పీల్చుకుంటే స్వీట్లు మరింత రుచికరంగా, జ్యూసీగా తయారవుతాయి. అంటే స్వీట్ రెడీ.

Follow Us