అబ్బబ్బో.. వీటిని టేస్ట్ చేస్తే వదిలి పెట్టరు.. మీరు ట్రై చేయండి!

Updated on: Jun 30, 2026 | 8:09 PM

మొక్కజొన్నలతో చేసే ఏ వంటకాలు అయినా సరే చాలా అద్భుతంగా ఉండటమే కాకుండా మంచి రుచిని కూడా ఇస్తాయి. వీటితో చాలా మంది అనేక రకాల వంటకాలు ప్రిపేర్ చేసుకుంటారు. అయితే, ఇప్పుడు లేత మొక్కజొన్నలతో వడలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం.

1 / 5
మొక్కజొన్న వడలు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు : స్వీట్ కార్న్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువలన మీరు తినాలి అనుకుంటే రెండు కప్పుల స్వీట్ కార్న్ తీసుకోవాలి. అలాగే బియ్యం పిండి, శనగపిండి, క్యారెట్, ఉల్లిపాయ, క్యాప్సికం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం

2 / 5
తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా స్వీట్ కార్న్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసి మెత్తగా ఉడకబెట్టుకోవాలి. అవి బాగా ఉడికిన తర్వాత రోటిలో కచ్చా పచ్చాగా దంచాలి. తర్వాత దీనిలో బియ్యం పిండి శనగ పిండి పచ్చి మిర్చీ, కరివేపాకు, ఉల్లిపాయలు, కారం, ఉప్పు అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి..

3 / 5
జీలకర్ర, ఇంగువ, ధనియాల పొడి, ఇలా అన్నీ వేసి వీలైనంత వరకు చాలా సాఫ్ట్‌గా మంచిగా కలుపుకోవాలి. దీనిని ఎంత బాగా కలిపితే వడలు అంత రుచిగా వస్తాయి, ఉప్పు, కారం కూడా చాలా అద్భుతంగా సరిపోతుంది. తర్వాత ఈ మిశ్రమాన్ని ఇరవై నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి.

4 / 5
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. అందులో వడలు వేయించు కోవడానికి సరిపడ నూనె వేసి, నూనె బాగా వేడి అయ్యేలా చూసుకోవాలి. నూనె నుంచి మంచి పొగలు వస్తున్న సమయంలో, అందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా చేతుల్లోకి తీసుకొని, వడల విధానంలో నూనెలో వేసుకోవాలి.

5 / 5
వడలు విధంగా నూనెలో వేసుకున్న తర్వాత వాటిని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. లోపల మెత్తగా ఉడికి, బంగారు రంగులో కాల్చుకోవాలి. అవి బంగారు రంగులో వచ్చాయి అంటే పూర్తిగా కాలినట్లు. అప్పుడు వాటిని తీసి వేరే బౌల్‌లో వేసుకోవాలి. ఇక వీటిని పల్లీల చట్నీ లేదా అల్లం చట్నీ వేటితో తిన్నా రుచి అదిరిపోతుంది.

Follow Us