కొత్తగా వంట నేర్చుకొనేవాళ్ళు కూడా ఇలా కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. మైమరచిపోవాల్సిందే

Updated on: Apr 24, 2026 | 10:37 PM

Easy Coconut Milk Chicken Recipe in telugu: కొత్తగా వంట నేర్చుకొనేవాళ్ళు కూడా ఇలా కొబ్బరి పాల చికెన్ చేశారంటే తిన్న వాళ్ళు మైమరచి పోవాల్సిందే.మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
కావాల్సిన పదార్థాలు: ముప్పావు కిలో చికెన్, రెండు కప్పుల కొబ్బరి పాలు, ఒక ఉల్లిపాయ, రెండు టమాటాలు, మూడు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టేబుల్ స్పూన్ పసుపు, రెండు కప్పుల పెరుగు, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత  ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, రెండు లవంగాలు, మూడు యాలకులు తీసుకోవాలి.

2 / 5
చికెన్ ఇలా మారినేషన్ చేయాలి: ముందుగా చికెన్‌ ను ఒక గిన్నెలో తీసుకుని  దానిలో కొద్దిగా పెరుగు, రుచికి తగినంత  ఉప్పు, రెండు  టేబుల్ స్పూన్స్  కారం, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టేబుల్ స్పూన్ పసుపు వేసి ముక్కలకు బాగా పట్టించాలి. ఇలా చేస్తే కూర వండిన తరవాత చచాలా టేస్టీగా ఉంటుంది.

3 / 5
మాసాల పొడిని తయారు చేసుకోవాలి : ముందుగా  కుక్కర్‌ పెట్టి దానిలో రెండు లవంగాలు, మూడు యాలకులు, రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసి  వాటిని  బాగా వేయించుకుని రోటిలో కానీ, మిక్సీలో కానీ వేసి వాటిని పొడి లాగా పట్టుకోవాలి. ఈ పొడిని కూర చివర్లో వేస్తే  చాలా చాలా రుచిగా ఉంటుంది.

4 / 5
ఇప్పుడు కొబ్బరి పాల చికెన్ ను ఇలా తీసుకోవాలి : ముందుగా పాన్ పెట్టి దానిలో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్  కలర్లోకి వచ్చే వరకు వాటిని బాగా వేయించాలి. కొద్దీ సేపటి తరవాత  దానిలో నాలుగు  పచ్చిమిర్చి, నాలుగు టమాటాలు వేసి పేస్ట్ లాగా అయ్యే  వరకు పొయ్యి మీదే ఉంచి మగ్గించుకోవాలి.

5 / 5
ముందుగా పక్కన పెట్టుకున్న ఈ మిశ్రమంలో చికెన్ వేసి 10 నిమిషాల పాటు వేసి బాగా కలుపుకోవాలి. చివర్లో అరకట్ట కొత్తిమీరను వేసి  కలుపుకోవాలి అలాగే,  ఒక కప్పు కొబ్బరి పాలు నీళ్లు కూడా  పోయాలి. ఇంకా దీనిలో కొద్దిగా ఉప్పు వేసి మూడు  విజిల్స్ వచ్చే వరకు  ఉడికించి కిందకు దించేయడమే.

Follow Us