బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి

Updated on: Jul 01, 2026 | 4:11 PM

పిల్లల లంచ్ బాక్స్ కోసం ఎంతో రుచికరమైన క్యాప్సికం రైస్ సులభంగా తయారుచేయండి. ఇంట్లోనే ప్రత్యేకమైన మసాలా పొడిని సిద్ధం చేసి, చల్లారిన అన్నంతో కలిపి కేవలం కొన్ని నిమిషాల్లో ఈ కమ్మని వంటకాన్ని సిద్ధం చేయవచ్చు. ఇది పిల్లలకు ఎంతో నచ్చుతుంది, పెద్దలు కూడా ఇష్టపడతారు.

1 / 5
కావలసిన పదార్థాలు:,  వండి చల్లార్చిన అన్నం: 1 కప్పు, క్యాప్సికం ముక్కలు: 1 కప్పు,  ఉల్లిపాయ ముక్కలు: కొన్ని,   పచ్చిమిర్చి ముక్కలు: కొన్ని, కరివేపాకు: కొద్దిగా,  అల్లం వెల్లుల్లి పేస్ట్: అర టీస్పూన్ ,  పసుపు: అర టీస్పూన్,   ఉప్పు: రుచికి సరిపడా, నూనె: 2 టేబుల్ స్పూన్లు,  కొత్తిమీర: గుప్పెడు,   పచ్చిశనగపప్పు: 1 టీస్పూన్,   మినప్పప్పు: 1 టీస్పూన్,  ఆవాలు: అర టీస్పూన్, జీలకర్ర: అర టీస్పూన్,   పచ్చిశనగపప్పు: 1 టేబుల్ స్పూన్,  మినప్పప్పు: 1 టేబుల్ స్పూన్, ధనియాలు: అర టేబుల్ స్పూన్,  జీలకర్ర: పావు టేబుల్ స్పూన్,  ఎండుమిర్చి: 2-3,  తెల్ల నువ్వులు: 1 టేబుల్ స్పూన్

2 / 5
తయారీ విధానంలోకి వెళితే..ముందుగా ఒక పాన్ తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. అందులో పచ్చి శనగపప్పు, మినపప్పు వేసి మీడియం ఫ్లేమ్‌లో దోరగా వేయించుకోవాలి. తర్వాత జీలకర్ర, ఎండు మిర్చి, నువ్వులు వేసి పచ్చివాసన పోయేవరకు వేయించుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ చల్లారబెట్టుకొని, అవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి.

3 / 5
ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం ముందుగా అన్నం వండి చల్లార్చి పెట్టుకోవాలి. అది పొడి పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికం రైస్ కోసం పోపు ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాలి. తర్వాత అందులో నూనె వేసి, బాగా వేడి చేయాలి. అందులో పచ్చిశనగ పప్పు, ఆవాలు, జీలకర్ర, వేసి  వేయించుకోవాలి. తర్వాత అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, కరివేపాకు వేసి మరోసారి వేయించుకోవాలి.

4 / 5
ఇప్పుడు అందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు, పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దాదాపు పదినిమిషాల పాటు ముక్కలు మంచిగా ఉడికేలా చూసుకోవాలి. క్యాప్సికం ముక్కలు మంచిగా ఉడికిన తర్వాత అందులో మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న అన్నం వేసి బాగా కలపాలి. తర్వాత అందులోనే మసాలాలు, కొత్తిమీర, అన్నీ వేసి మంచిగా కలిపి పెట్టుకోవాలి.

5 / 5
అంతే చాలా సులభంగా తయారు చేయగలిగే రుచికరమైన క్యాప్సికం రైస్ రెడీ, దీనిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అంతే కాకుండా ఈ క్యా్ప్సికం రైస్ చాలా సులభంగా తయారు చేయవచ్చును. అంతే కాకుండా పిల్లలు మాత్రమే కాకుండా, పెద్దలు కూడా చాలా ఇష్టంగా ఈ రైస్ తింటుంటారు.

Follow Us