పల్లీలు తిన్న వెంటనే ఈ పని చేశారో అంతే సంగతి.. మీ ఆరోగ్యానికి యమ డేంజర్‌..!

Updated on: Jun 30, 2025 | 1:41 PM

వేరుశనగలు వీటిని పల్లీలు అని కూడా చాలా మందికి పిలుస్తారు. అయితే, ఈ పల్లీల వల్ల కలిగే ప్రయోజనాలేంటో దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పల్లీలు అనేది పేదవాడి బాదంగా చెబుతారు. ఎందుకంటే ఇది పోషకాల గని. ఆరోగ్యానికి మంచి పోషకమైన ఆహారం. ప్రోటీన్, ఫైబర్, మంచి కొవ్వులు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. వీటిని పచ్చిగా, వేయించి లేదా ఉడికించి కూడా తినవచ్చు. అయితే, పల్లీలు తిన్న వెంటనే చేసే కొన్ని పనుల వల్ల మీ ఆరోగ్యం డేంజర్‌లో పడే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అదేంటంటే...

1 / 5
పల్లీలు అంటే చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే, వీటిని తిన్న వెంటనే నీళ్లు మాత్రం తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయటం ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు.  వేరుశనగ తిన్న వెంటనే నీళ్లు తాగితే అవి సరిగ్గా జీర్ణం కావు. వేరుశెనగలు గట్టిగా ఉండటం వల్ల, అవి కడుపులో జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

2 / 5
పల్లీలు తిన్నవెంటనే నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. దీనివల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాకుండా పోతుంది. వేరుశెనగ తిన్న వెంటనే నీరు త్రాగడం వల్ల జీర్ణవ్యవస్థలోని ఎంజైమ్‌ల పనితీరుకు అంతరాయం కలుగుతుంది.

3 / 5
పల్లీలు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. కానీ మీరు వెంటనే చల్లటి నీరు తాగితే, ఈ ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోతుంది. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత మారినప్పుడు జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు వస్తాయి.

4 / 5
పల్లీలు కొద్దిగా జిడ్డుగా ఉంటాయి. వీటిని తిన్న వెంటనే నీరు త్రాగడం వల్ల మీ గొంతులోని తేమ తగ్గి గొంతు నొప్పి వస్తుంది. వేరుశెనగ తిన్న తర్వాత కనీసం 30 నుండి 45 నిమిషాలు వేచి ఉండి నీరు త్రాగడం మంచిది.

5 / 5
అంతేకాదు.. పల్లీలు తిన్న తర్వాత తినకూడనివి మరికొన్ని ఉన్నాయి. పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగటం ఎంత ప్రమాదమో..అలాగే, చాక్లెట్స్, ఐస్‌క్రీమ్, సిట్రస్ పండ్లు, పాలు వంటివి కూడా తీసుకోరాదని నిపుణులు చెబుతున్నారు. వేరుశనగ తిన్న వెంటనే పాలు తాగకూడదు. వేరుశనగలో నూనె ఉంటుంది. కాబట్టి దాన్ని తిన్న వెంటనే పాలు తాగితే జీర్ణం కావడం కష్టం. గొంతు, జీర్ణ సమస్యలు వస్తాయి.