కాశ్మీర్ ఆఫ్ సౌత్ ఇండియా అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారో తెలుసా?.. ఈ సీజన్‌లో తప్పక చూడాల్సిన ప్రదేశం

Updated on: Jul 12, 2026 | 3:55 PM

చిన్నగా మంచు వర్షం, చూట్టూ కొండలు, అందమైన దృశ్యాలు.. ఈ వాతావరణం కార్మీర్‌లోనే ఉందని చాలా మంది అనుకుంటారు. కానీ మన సౌత్‌ ఇండియాలో కూడా అలాంటి ఒక ప్రదేశం ఉందని మీకు తెలుసా? ఇక్కడ కూడా ఏడాది పొడవునా చల్లటి వాతావరణం, ఎత్తైన కొండలు, పచ్చని ప్రకృతి అందాలతో కాశ్మీర్‌ను తలపించేలా ఉంటుంది. ఈ ప్రాంతాన్నే కాశ్మీర్‌ను ఆఫ్ సౌతిండియా అని కూడా పిలుస్తారు. ఇంతకూ ఈ ప్రాంతం ఏది, అది ఏ రాష్ట్రంలో ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5
కార్మీర్ తరహా వాతవరణం మన సౌతిండియాలో కేరళలోని పశ్చిమ కనుమలలో ఉన్న మున్నార్‌లో మాత్రమే కనిపిస్తుంది, దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హిల్ స్టేషన్లలో ఇది కూడా ఒకటి. అలలలా సాగిపోయే తేయాకు తోటలు, పొగమంచుతో నిండిన పర్వతాలు, ఏడాది పొడవునా ఉండే చల్లని వాతావరణమే దీనికి 'దక్షిణ భారతదేశ కాశ్మీర్' అనే పేరు వచ్చింది. కొండలపై విస్తరించి ఉన్న విశాలమైన తేయాకు తోటలే ఈ ప్రాంతానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

2 / 5
మిలిగిన ప్రాంతాలతో పోల్చుకుంటే.. మున్నార్‌లోఏడాది పొడవునా చల్లని వాతావరణం ఉంటుంది. ఈ ఆహ్లాదకరమైన వాతావరణం వల్ల వికెండ్ ట్రిప్‌లో చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. అలాగే సమ్మర్, రెయినీ సీజన్‌లో ఇక్కడ పర్యాటకుల తాకిడి ఎక్కవుగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో ఇక్కడి ప్రకృతి అందాలు మరింత అద్భతంగా కనిపిస్తాయి. సన్‌రైజ్ వ్యూ పాయింట్స్, పొగమంచుతో నిండిన కొండలు ఇక్కడికి వచ్చేపర్యాటకులను పోటో గ్రాఫర్‌లను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

3 / 5
అంతరించిపోతున్న నీలగిరి తహర్ జనాభాకు నిలయమైన ఎరవికుళం అనే జాతీయ ఉద్యానవనం కూడా మున్నార్‌లోనే ఉంది. ట్రెకింగ్ లవర్స్, ఎత్తైన కొండలు ఇష్టపడేవారికి ఈ పార్క్ చాలా బాగా నచ్చుతుంది. ఈ ప్రాంతంలో అట్టుకాడ్ జలపాతం, లక్కం జలపాతం, చీయాపార జలపాతం వంటి అందమైన జలపాతాలు కూడా ఉన్నాయి. వర్షాకాలంలో ఈ జలపాతాలు మరింత ఉధృతంగా, అందంగా కనిపిస్తాయి.

4 / 5
ఇక్కడే ఎకో పాయింట్ అనే ప్లేస్ కూడా ఉంది. మున్నార్‌ వచ్చే పర్యాటకు కచ్చితంగా ఈ ప్లేస్ విజిల్ చేయడానికి ఇష్టపడుతారు. ఎందుకంటే ఈ ప్లేస్‌లో మన చెప్పే మాటలు ప్రతిద్వనిస్తూ.. మనకు ఎంతో ఆహ్లదకరాన్ని కలిగిస్తాయి. దీన్ని పక్కనే ఉన్న మాట్టుపెట్టి డ్యామ్ అడవులు, కొండల మధ్య పడవ ప్రయాణం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది.

5 / 5
ఈ ప్రాంతంలో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి అరుదైన నీలకురింజి పూల వికసిస్తాయి. దీంతో ఈ ప్రాంతం మొత్తం నీలం రంగు కొండలతో అద్భుతంగా మారిపోతుంది. ఈ అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి సందర్శకులు వస్తారు. మీరు ట్రెకింగ్, క్యాంపింగ్, అడ్వెంచర్స్ ఇష్టపడితే ఈ ప్లేస్ మీకు చాలా బెస్ట్ చాయిస్ అవుతుంది. ఇది మీకు లైఫ్‌లోనే బెస్ట్ అనుభూతులను మిగుల్చుతుంది.

Follow Us