
అన్ని మాసాల్లోకెల్లా శ్రావణమాసం ప్రత్యేకతే వేరు. ఈ మాసాన్ని చాలా పవిత్రమైన మాసం అంటారు. అంతేకాకుండా శివుడికి ఈ శ్రావణమాసం చాలా ప్రీతికరం. అందుకే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ దేవాలయాలకు వెళ్లి, ఉపవాసాలు ఉంటూ, పూజ చేస్తుంటారు. అయితే అసలు శ్రావణ మాసంలో గుడికి వెళ్లడం వలన ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో చాలా మందికి తెలియదు. కాగా, ఇప్పుడు దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

దేవాలయాలను సందర్శించడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు పండితులు. ముఖ్యంగా మనశ్శాంతి, ప్రశాంతత కలుగుతుందంట. అయితే ఒక్క రోజులో అనేక దేవాలయాలను మాత్రం అస్సలే సందర్శించకూడదంట.

జ్యోతిష్యులు దీని గురించి చెబుతూ.. నిత్యం వేలాది మంది మంది భక్తులు దేవాలయాలను సందర్శిస్తుంటారు. ఇలా పవిత్ర స్థలాలను సందర్శించి, భక్తితో భగవంతుడిని పూజించడం వలన మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందంట. అంతే కాకుండా చాలా రోజుల నుంచి ఒత్తిడితో బాధపడుతున్న వారు కూడా దాని నుంచి బయటపడి సంతోషంగా ఉంటారని తెలిపారు.

మానవ జీవితంలో శాంతి, మానసిక ఆనందం, సానుకులత కోసం చాలా మంది దేవాలయాలకు వెళ్లి భగవంతున్ని దర్శించుకుంటారు. తన కష్టాలు ఆయనతో చెప్పుకొని కాస్త ఉపశమనం పొందుతారు. ఇది ఈ కాలంలోనే కాదు, ప్రాచీన కాలం నుండి, కృత, త్రేత, ద్వాపర,కలియుగాల వరకు ఉంది. ఇలా పవిత్ర స్థలాలను సందర్శించడం చాలా మంచిది.

అయితే, ఒక రోజులో అనేక ప్రదేశాలను సందర్శించడం మంచిది కాదు. ప్రతి ప్రదేశంలో సమయం గడపడం, దేవుని దర్శనం పొందడం చాలా అవసరం, ఇది ఒత్తిడి, మానసిక సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. అంతే కాకుండా మీలో మనోధైర్యాన్ని పెంపొందిస్తుందని చెబుతున్నారు పండితులు. ( నోట్ : ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడినది, టీవీ9 తెలుగు దీనిని దృవీకరిచలేదు.)