కూర అవసరమే లేదు ఈ చారు చేస్తే.. కడుపు నిండుగా తింటారు!

Updated on: Nov 09, 2026 | 8:45 AM

ప్రతి ఒక్కరూ కడుపు నిండుగా తినాలి అనుకుంటారు. కానీ ఎప్పుడు ఇష్టంగా కడుపు నిండుగా తింటారు. తమకు నచ్చిన కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు లేదా, ఏదైనా వంటకం చాలా ఇష్టంగా ప్రిపేర్ చేసినప్పుడు మాత్రమే కడుపు నిండుగా తింటారు. అయితే కర్రీ లేకుండా మీరు చాలా ఇష్టంగా అన్నం తినాలి అనుకుంటున్నారా? మీ కోసమే ఈ సమాచారం.

1 / 5
కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. టమాటాలు: 2 ,   ఉల్లిపాయ: 1 ,   పచ్చిమిర్చి: 2 ,   చింతపండు: నిమ్మకాయ సైజు,  నీరు: 2 గ్లాసులు,  ఉప్పు: రుచికి సరిపడినంత ,   కారం: 1 స్పూన్, పసుపు: పావు స్పూన్ మసాలా కోసం:   ధనియాలు: 2 స్పూన్లు,  జీలకర్ర: 1 స్పూన్,   మిరియాలు: అర స్పూన్,   వెల్లుల్లిపాయ రెబ్బలు: 4,   కరివేపాకు: కొద్దిగా.. తాలింపు కోసం: నూనె: 2 టేబుల్ స్పూన్లు,   మెంతులు: పావు స్పూన్,   ఆవాలు: అర స్పూన్,  జీలకర్ర: పావు స్పూన్,   ధనియాలు: పావు స్పూన్,   వెల్లుల్లిపాయ రెబ్బలు: 4,  ఉల్లిపాయ తరుగు,   ఎండుమిర్చి,   కరివేపాకు,   ఇంగువ,  కొత్తిమీర.

2 / 5
తయారీలోకి వెళ్లితే.. ముందుగా, ఒక పాత్ర తీసుకొని అందులో చిన్న ముక్కలుగా కోసిన రెండు టమాటాలు, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, మధ్యకు చీల్చిన రెండు పచ్చిమిర్చి, శుభ్రం చేసిన నిమ్మకాయ సైజు చింతపండు వేయాలి. రెండు గ్లాసుల నీళ్లు పోసి, రుచికి సరిపడినంత ఉప్పు , ఒక స్పూన్ కారం, పావు స్పూన్ పసుపు వేసి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.

3 / 5
చారు కోసం మసాలా సిద్ధం చేసుకోవాలి. ఒక చిన్న రోలులో రెండు స్పూన్ల ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, అర స్పూన్ మిరియాలు, పొట్టుతో సహా నాలుగైదు వెల్లుల్లిపాయ రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసి దంచుకోవాలి. దంచుకున్న ఈ మసాలా మిశ్రమాన్ని టమాటో గిన్నెలో వేసి, స్టవ్ వెలిగించి మీడియం మంటపై బాగా మరిగించాలి.

4 / 5
చారు బాగా మరిగిన తర్వాత, స్టవ్ ఆపి ఒక స్టైనర్ సహాయంతో వడగట్టుకోవాలి. రసం సేకరించిన తర్వాత మిగిలిన టమాటో గుజ్జు మిశ్రమంలో ఒక గ్లాసు నీళ్లు పోసి చేతితో బాగా మెదిపి మిగిలిన రసాన్ని కూడా తీయాలి. ఇలా చేయడం వల్ల చింతపండు, టమాటాలు, మసాలాలలో మిగిలిన రుచులు కూడా రసంలోకి వస్తాయి. పిప్పిని పక్కకు తీసివేయాలి.

5 / 5
ఇప్పుడు చారుకు తాలింపు సిద్ధం చేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె  పాన్ పెట్టి పోపు దినుసులు, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఎండు మిర్చి, కరివేపాకు,ఇంగువ వేసి పోపు సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందగా తీసుకున్న ధనియాల రసం పోయాలి.  చివరిగా ఒక గుప్పెడు కొత్తిమీరను వేసి బాగా కలుపుకోవాలి. ఒక నిమిషం మాత్రమే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ ధనియాల రసం రెడీ

Loading...
Unable to load recommendations.
Follow Us