కమ్మనైన పల్లీ కారంపొడి: వేడివేడి అన్నం, టిఫిన్లలోకి అద్భుతమైన రుచినిచ్చే సులువైన తయారీ విధానం!

Updated on: Aug 15, 2026 | 8:45 AM

మన వంటింట్లో ఎప్పుడూ అందుబాటులో ఉండే పదార్థాలతో చాలా తక్కువ సమయంలో తయారు చేసుకునే అద్భుతమైన రెసిపీలలో పల్లీ కారంపొడి ఒకటి. ఆఫీస్‌కు వెళ్లే హడావిడిలో ఉదయం టిఫిన్స్‌కు చట్నీలు చేసే సమయం లేనప్పుడు, లేదా ఇంట్లో కూరలు ఏమీ నచ్చనప్పుడు వేడివేడి అన్నంలో కాస్తంత నెయ్యి, ఈ పొడి వేసుకుని తింటే కలిగే సంతృప్తే వేరు.

1 / 5
ఒక్కసారి చేసుకుంటే రెండు మూడు నెలల పాటు నిల్వ ఉండే ఈ కమ్మని పొడిని ఎలా తయారు చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం. ఈ పొడికి కావాల్సిన పదార్ధాలు.. వేరుశెనగ గుళ్లు – 2 కప్పులు, నూనె – 1 టేబుల్ స్పూన్, కడిగి ఆరబెట్టిన కరివేపాకు – 1 కప్పు, చింతపండు – నిమ్మకాయంత, జీలకర్ర – 1 టేబుల్ స్పూన్, కారం పొడి – 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు – 2 పెద్ద పాయలు,  ఉప్పు – తగినంత.

2 / 5
తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని రెండు కప్పుల పల్లీలను వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, మాడిపోకుండా గరిటెతో కలుపుతూ దోరగా వేయించాలి. పల్లీల పైపొట్టు చేత్తో నలిపితే సులువుగా వచ్చేంత వరకు వేయించి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడిచేయాలి.

3 / 5
నూనె కాగాక శుభ్రంగా కడిగి ఆరబెట్టిన కరివేపాకును వేసి క్రిస్పీగా మారే వరకు వేయించాలి. ఆ తర్వాత వేయించిన పల్లీలు, చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న చింతపండును కూడా వేసి రెండు నిమిషాలు వేయించాలి. చివరగా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి లో-ఫ్లేమ్‌లో రెండు నిమిషాలు వేయించి స్టవ్ ఆపేయాలి.

4 / 5
స్టవ్ ఆపిన వెంటనే వేడి మీదనే అర కప్పు కారం పొడి వేసి పదార్థాలన్నింటికీ పట్టేలా బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేస్తే పొడి ముద్దగా మారిపోతుంది. చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకుని, తగినంత ఉప్పు వేసి మిక్సీని ఆపుతూ ఆపుతూ సగం నలిగేలా తిప్పాలి. ఆ తర్వాత పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తటి పౌడర్‌లా చేయకుండా పలుకుగా ఉంటేనే పొడి ఎంతో రుచిగా ఉంటుంది.

5 / 5
గ్రైండ్ చేసిన పొడిని కొద్దిసేపు ఒక పళ్లెంలో ఆరబెట్టి, ఆ తర్వాత గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ పల్లీ కారంపొడి ఇడ్లీ, దోస, ఉప్మా, పొంగల్ వంటి అన్ని రకాల టిఫిన్లలోకి అద్భుతంగా సరిపోతుంది. ముఖ్యంగా వేడి అన్నంలో నెయ్యితో కలిపి మొదటి ముద్దగా తింటే నోరూరించే రుచితో ప్రతి ఒక్కరినీ మెప్పిస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us