
సాధారణంగా ద్రవాలు వేడికి వ్యాకోచించి, చల్లదనానికి సంకోచిస్తాయనే ప్రాథమిక థర్మోడైనమిక్స్ సూత్రం నుంచి వచ్చిన ఆలోచన. నిజానికి పెట్రోల్ అనేది వేడికి వ్యాకోచించిస్తుంది. కానీ దీని ప్రభావం బయటి వాతావరణ ఉష్ణోగ్రతపై కాకుండా, పెట్రోల్ బంకుల్లో ఇంధనాన్ని ఎలా నిల్వ చేస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది.

అవును మన దేశంలో దాదాపు అన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధనాన్ని అండర్‌గ్రౌండ్ ట్యాంకుల్లోనే ఎక్కవగా నిల్వ చేస్తారు. కాబట్టి భూమి అడుగు భాగంగా ఉష్ణోగ్రత అనేది స్థిరంగా ఉంటుంది. మధ్యాహ్నమైనా లేదా అర్థరాత్రైనా ఆ ట్యాంకుల్లో ఉష్ణోగ్రతలో ఎలాంటి మార్పులు ఉండవు అనేది నిపుణులు చెబుతున్న మాట.కాబట్టి బయటి వేడి వల్ల పంప్ చేసే పెట్రోల్ సాంద్రతలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని నిపుణులు అంటున్నారు.

అయితే ఒక వేళ అండర్‌గ్రౌండ్ ట్యాంకుల్లోని పెట్రోల్ ఉష్ణోగ్రతలో మార్పులు ఉన్నప్పటికీ.. అది కేవతం 1°C కంటే తక్కువగానే ఉంటుందని సర్వేలు తేల్చాయి. ఇంత కొద్ది మార్పు కారణంగా హనంలోకి వచ్చే పెట్రోల్ పరిమాణంలో మార్పు పెద్దగా ఉండకపోవచ్చు లేదా అసలు లేకపోవచ్చని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఉదయం కంటే రాత్రి కొట్టిస్తే పెట్రోల్ ఎక్కవగా వస్తుందనడం వాస్తవం కాదంటున్నారు.

అయితే పగలు ఉండే వేడి కారణంగా కొట్టించేప్పుడు పెట్రోల్ ఆవిరైపోతుందని కూడా కొందరు నమ్ముతారు. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న సీల్ చేసిన నాజిల్స్, వేపర్ రికవరీ సిస్టమ్స్ కారణంగా అది సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. ఇప్పుడున్న ఆదునిక టెక్నాలజీ ద్వారా ఆయిల్ కంపెనీలు పెట్రోల్ పంపుల కొలతలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తాయి. మీరు ఉదయం, మధ్యాహ్నం లేదా అర్ధరాత్రి ఎప్పుడు ఇంధనం పోసుకున్నా మిషన్ చూపించే పరిమాణమే కచ్చితంగా లభిస్తుంది.

అయితే ఇక్కడ సమయం ముఖ్యమే అయినప్పటికీ.. దానికి కారణం వేరే ఉంది. అవును రాత్రి సమయంలో లేదా తెల్లవారుజామున పెట్రోల్ కొట్టించడం ద్వారా నిజంగానే మనకు కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ సమయాల్లో పెట్రోల్ బంకుల్లో రద్దీ తక్కువగా ఉంటుంది. మీ టైం కూడా సేవ్ అవుతుంది. ఇదొక్కటే తప్ప రాత్రి టైంలో పెట్రోల్ కొట్టించడం వల్ల ఎక్కువ ఇంధనం వస్తుందనడానికి కచ్చితమైన ఆధారాలు అయితే లేవు.