
శీతాకాలంలో ఎక్కడ చూసినా సరే సీతాఫలం పండ్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ పండులో ఉండే గుజ్జు ప్రతి ఒక్కరూ ఇష్టపడుతుంటారు. చాలా తియ్యగా ఉంటుంది. అంతే కాకుండా దీంతో చాలా మంది ఐస్ క్రీమ్ వంటివి, జ్యూస్లో చేసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. కానీ కొందరు వీటిలోని గింజలను తీసి వేయడానికి ఎక్కువగా శ్రమ పడిపోతుంటారు. కొన్ని సార్లు తినడానికి అంతగా ఆసక్తి చూపరు.

కానీ సీతాఫలం పండులోని విత్తనాలను చాలా సులభంగా తొలిగించవచ్చునంట. ఎలా అంటే? విత్తనాలను ఒకొక్కటిగా తీస్తే వాటిని పండు నుంచి వేరుచేయడానికి చాలా సమయం పడుతుంది అంతే కాకుండా గుజ్జు మొత్తం కూడా చేతులకు అంటుక పోతుంది. అందువలన గుజ్జు చేతులకు అంటుకోకుండా, దానిని కాసేపు ఫ్రిజ్లో పెట్టి విత్తనాలను చెంచా సహాయంతో తియ్యాలి. దీని వలన గుజ్జు గట్టి పడి చేతికి అంటుకోకుండా ఉంటుంది. గింజలు కూడా సులభంగా వస్తాయి.

అలాగే సీతాఫలాన్ని రెండు భాగాలుగా విడదీసి, మొత్తం దాని నుంచి గింజలు గుజ్జు ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత బౌల్ నుంచి స్పూన్ సహాయంతో లేదా చేతితో గింజలను వేరు చేయాలి. దీని వలన గుజ్జు పాడవకుండా ఉంటుంది. సులభంగా గింజలను తీసి వేయవచ్చును.

ఇలా కాకుండా మిక్సర్ సహాయంతో కూడా సీతాఫలంలో గుజ్జును గింజలను వేరు చేయవచ్చును. దీని కోసం సీతాఫలం గుజ్జును మిక్సర్ జార్లో వేసి, తక్కువ వేగంతో ఒకటి రెండు సార్లు తిప్పాలి అంతే, తర్వాత గింజలు విరిగిపోతాయి. అప్పుడు ఒక బౌల్ లోకి తీసుకొని చెంచాతో మెత్తగా స్మాష్ చేయడం వలన గింజలు గుజ్జు వేరవుతుంది. గిజలను చేతితో తీసి వేయాలి అంతే. సులభంగా గింజలు గుజ్జు వేరు అవుతుంది.

అంతే కాకుండా పండులో ఉన్న సమయంలోనే చెంచా సహాయంతో గుజ్జు నుంచి గింజలను వేరు చేయవచ్చును. ఇక ఇలా గుజ్జును వేరు చేసిన వాటితో మిల్క్ షేక్, జ్యూస్ వంటివి తయారు చేసుకోవచ్చును. అయితే ఎప్పుడైనా సరే గుజ్జును సరిగ్గా వేరు చేస్తేనే ఏదైనా చేసుకోవడానికి వీలు అవుతుంది. గింజలు తినడానికి వీలు లేదు కాబట్టి వాటితో సహా మిక్సీ పట్టడం వాటిని నలపడం వంటిది చేయకూడదంట.