ఆడపిల్లల నడుము, ఎముకలకు బలాన్నిచ్చే పాతకాలంనాటి గారెలు.. నూనె పీల్చకుండా కమ్మగా.. కారంగా..

Updated on: May 07, 2026 | 8:56 AM

ఆడపిల్లల నడుము, ఎముకలకు బలాన్నిచ్చే పాతకాలంనాటి గారెలు. ఈ వేడి వేడి చెక్క గారెలను చేసుకున్న తరవాత కొబ్బరి చట్నీతో కానీ, అల్లం చట్నీతో కానీ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మరి, ఇంకెందుకు లేట్ కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5
మినప, పెసర్ల చెక్క గారెలకు కావలసిన పదార్థాలు: ఒక కప్పు మినప్పప్పు , ఒక కప్పు పెసరపప్పు, నాలుగు పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క , ఒక ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు, అర కట్ట కొత్తిమీర, అర టీ స్పూన్ జీలకర్ర, రుచికి  సరిపడా ఉప్పును తీసుకోవాలి. ఇంకా గారెలను కాల్చడానికి  తగినంత నూనెను తీసుకోవాలి.

2 / 5
మినప, పెసర్ల చెక్క గారెలు తయారీ విధానం: ముందుగా పప్పులను నానబెట్టుకోవాలి. మినప్పప్పు, పెసరపప్పును ఒకటికి  కడిగి 4–5 గంటలు నానబెట్టాలి. అయితే, నానిన తర్వాత నీటిని వడపోయాలి. ఇలా చేస్తే గారెలు క్రిస్పీగా వస్తాయి. ఆ తరవాత పప్పులను మిక్సీలో  మరి జోరుగా కాకుండా గరుకుగా గ్రైండ్ చేసుకోవాలి.

3 / 5
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో నాలుగు పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, అర కట్ట కొత్తిమీరను వేసి కలపాలి. ఇంకా దీనిలో రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్  జీలకర్ర వేసి చేతికి నూనెను రాసుకుని చిన్న  ముద్ద లాగా చేసుకుని  చెక్కల్లాగా  పలుచగా చేయాలి.

4 / 5
ఇలా చేసుకుంటే గారెలు టేస్టీగా ఉంటాయి. ఇంకా దీనిలో పాన్ లో ఆయిల్ వేసి మీడియం మంటపై గారెలను కాల్చుకోవాలి.
ఒక వైపు కాలిన తరవాత ఇంకో వైపు కూడా బంగారు కలర్లోకి  వచ్చే వరకు బాగా వేయించాలి. వీటిని స్లో గా వేయిస్తే లోపల కూడా  మంచిగా  ఉడుకుతాయి.

ఇలా చేసుకుంటే గారెలు టేస్టీగా ఉంటాయి. ఇంకా దీనిలో పాన్ లో ఆయిల్ వేసి మీడియం మంటపై గారెలను కాల్చుకోవాలి. ఒక వైపు కాలిన తరవాత ఇంకో వైపు కూడా బంగారు కలర్లోకి వచ్చే వరకు బాగా వేయించాలి. వీటిని స్లో గా వేయిస్తే లోపల కూడా మంచిగా ఉడుకుతాయి.

5 / 5
అయితే, దీనిలో మనం మినుములు, పెసర్లు వేస్తాం కాబట్టి ఇవి అందరికి పడవు. మీకు ఇతర సమస్యలు ఉంటే వైద్యున్ని సంప్రదించి తినడం మంచిది.  (నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us