
కావలసిన పదార్థాలు: 2 కప్పుల బాలామృతం పొడి, అర కప్పు గోధుమపిండి, 100 గ్రాముల వెన్న, అర కప్పు బెల్లం పొడి, 1 నుండి 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు , పావు కప్పు డ్రై ఫ్రూట్స్ తరుగు, పావు టీస్పూన్ యాలకుల పొడి, 3 నుండి 4 టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన పాలు

తయారీ విధానం: ఒక మిక్సింగ్ బౌల్‌లోకి గది ఉష్ణోగ్రత వద్ద మెత్తగా ఉన్న 100 గ్రాముల వెన్నను తీసుకోవాలి. ఇందులో అర కప్పు బెల్లం పొడి వేయాలి. విస్కర్ లేదా స్పూన్‌తో సుమారు 3-4 నిమిషాల పాటు బెల్లం కరిగి వెన్నతో కలిసిపోయి లేత రంగుతో నునుపైన క్రీమ్‌లా మారేంత వరకు బాగా బీట్ చేయాలి.

ఈ క్రీమీ మిశ్రమంలోకి 2 కప్పుల బాలామృతం పొడి, అర కప్పు గోధుమపిండి, పావు టీస్పూన్ యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేయాలి. ఇందులోనే పావు కప్పు సన్నగా తరిగిన బాదం-జీడిపప్పు పలుకులు వేసి చేత్తో అంతా బాగా కలిసేలా పొడిపొడిగా కలపాలి. ఈ పిండిలోకి కాచి చల్లార్చిన పాలను కొద్దికొద్దిగా చిలకరిస్తూ కలుపుకోవాలి.

మొత్తంగా 3 నుండి 4 టేబుల్ స్పూన్ల పాలు మాత్రమే పడతాయి; పిండిని చపాతీ ముద్ద కంటే గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. పిండిని రెండు లేదా మూడు పెద్ద ముద్దలుగా విభజించుకోవాలి. ఒక బటర్ పేపర్ లేదా ప్లాస్టిక్ షీట్‌పై ఒక పిండి ముద్దను ఉంచి చేత్తో కాస్త ఫ్లాట్‌గా ఒత్తాలి.

చపాతీ కర్రతో మరీ పల్చగా కాకుండా, మరీ మందంగా కాకుండా సరైన కుకీ మందంతో చతురస్రాకారంలో రోల్ చేసుకోవాలి. చాకుతో అంచులను కట్ చేసి రెక్టాంగిల్ లేదా స్క్వేర్ షేప్‌లో బిస్కెట్లను కోసుకోవాలి; చాకు వెనుక భాగంతో పైన క్రాస్ లైన్స్ పెట్టి బిస్కెట్ డిజైన్ వేసుకోవాలి.