
విజయ్ హజార్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌లో మహారాష్ట్ర ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఒక ఓవర్‌లో 7 సిక్సర్లు కొట్టాడు. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఉత్తరప్రదేశ్ బౌలర్ శివ సింగ్ బౌలింగ్‌లో గైక్వాడ్ ఈ ఘనత సాధించాడు. శివ యూపీకి చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్. ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన చెత్త రికార్డు అతని పేరిట నమోదైంది.

దీంతో శివ సింగ్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. అసలు ఎవరీ శివ సింగ్ అంటూ తెలుసుకోవడం ప్రారంభించారు. ఆయన కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శివ సింగ్ ఉత్తరప్రదేశ్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. అతను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్.

శివ భారత అండర్-19 జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు. పృథ్వీ షా కెప్టెన్సీలో 2018లో అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన టీంలో ఉన్నాడు. 2018 అండర్-19 ప్రపంచకప్‌లో శివ 6 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 4 వికెట్లు తీశాడు. అదే సమయంలో అతను ఆ ప్రపంచ కప్‌లో చాలా పొదుపుగా నిరూపించుకున్నాడు. అతని ఎకానమీ రేటు కేవలం 3.23 మాత్రంగానే నిలిచింది.

23 ఏళ్ల శివ సింగ్ 2018-19లో యూపీ తరపున లిస్ట్ ఏలో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు ఈ ఫార్మాట్‌లో 7 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 5 వికెట్లు ఉన్నాయి. యూపీ తరపున టీ20లో 15 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 9 వికెట్లు తీశాడు.

విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌లో శివ సింగ్ బౌలింగ్‌లో గైక్వాడ్ ఒక ఓవర్‌లో గరిష్టంగా 7 సిక్సర్లు కొట్టాడు. ఈ ఓవర్‌లో అతను నో బాల్‌తో సహా మొత్తం 7 బంతులు వేశాడు. అందులో గైక్వాడ్ అన్ని బంతుల్లో సిక్స్‌లు కొట్టాడు.

ఈ ఓవర్‌లో గైక్వాడ్ మొత్తం 43 పరుగులు చేసి ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అదే సమయంలో ఓ ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా శివ సింగ్ నిలిచాడు.