
టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్‌లో గురువారం ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో టైటిల్ కోసం ఎవరు తలపడాలనేది ఈ మ్యాచ్‌తో తేలిపోనుంది.

టీ20 ప్రపంచకప్ 2016 తొలి రౌండ్‌లోనే డకౌట్ అయిన పాకిస్థాన్ ఈసారి అద్భుత ప్రదర్శన చేసింది. టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. మరోవైపు, 2010 రన్నరప్ ఆస్ట్రేలియా సరైన సమయంలో తమ అత్యుత్తమ ఆటను కనబరుస్తోంది. తొలిసారి టైటిల్‌ను గెలుచుకోవాలని ఆసీస్ ఆశపడుతోంది.

పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య ఇప్పటి వరకు మొత్తం 22 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఈ 22 మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌దే పైచేయి. 22 మ్యాచుల్లో పాకిస్థాన్ 13 మ్యాచ్‌లు గెలుపొందగా, ఆస్ట్రేలియా 9 మ్యాచ్‌లు గెలిచింది.

టీ20 ప్రపంచకప్ గురించి మాట్లాడితే, ఇప్పటివరకు ఆడిన ఆరు టీ20 ప్రపంచకప్‌లలో పాకిస్థాన్ ఆరుసార్లు ఆస్ట్రేలియాతో తలపడింది. ఇక్కడ ఇరు జట్లు సమంగా ఉన్నాయి. ఆరింటిలో పాకిస్థాన్ మూడు మ్యాచ్‌లు, ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌లు గెలిచాయి.

ఇరు జట్లు చివరిసారిగా 2016లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో తలపడ్డాయి. ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వగా, ఇరుజట్ల మధ్య మ్యాచ్ మొహాలీలో జరిగింది. స్టీవ్ స్మిత్ సారథ్యంలోని ఆస్ట్రేలియా పాకిస్థాన్‌కు 193 పరుగుల లక్ష్యాన్ని అందించి 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.