2 / 5
నరేంద్ర హిర్వానీ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జన్మించారు. అయితే చిన్న వయసులోనే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో స్థిరపడ్డారు. కేవలం 16 ఏళ్ల వయసులోనే మధ్యప్రదేశ్ రంజీ జట్టులో చోటు సంపాదించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మంచి ప్రదర్శన చేసిన తర్వాత, 1988లో వెస్టిండీస్‌తో స్వదేశీ సిరీస్‌లో అరంగేట్రం చేసే అవకాశం లభించింది.