NZ vs SA: జాక్వెస్ కల్లిస్ భారీ రికార్డును బ్రేక్ చేసిన క్వింటన్ డి కాక్.. తొలి సౌతాఫ్రికా ప్లేయర్‌గా..
ICC ODI World Cup 2023, Quinton de Kock breaks Kallis’ record: సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డి కాక్ అద్భుతమైన రికార్డ్‌ను తన పేరుతో లిఖించుకున్నాడు. ప్రపంచ కప్‌లో ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన దక్షిణాఫ్రికా బ్యాటర్ రికార్డును బద్దలు కొట్టాడు. గతంలో 2007లో జాక్వెస్ కల్లిస్ చేసిన 485 పరుగుల రికార్డును డి కాక్ అధిగమించాడు. ఒకే ప్రపంచ కప్ ఎడిషన్‌లో దక్షిణాఫ్రికా ప్లేయర్లు చేసిన అత్యధిక పరుగుల లిస్టులో ఎవరున్నారో ఓసారి చూద్దాం.