WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్‌లో టీమిండియా దిగ్గజ ప్లేయర్ ఎంట్రీ.. ఏ జట్టులో చేరనుందంటే?

|

Jan 27, 2023 | 5:59 PM

Mithali Raj: మహిళల ప్రీమియర్ లీగ్ ఎప్పుడు ప్రారంభమైనా ఆ టోర్నీలో ఆడాలని కోరుకుంటున్నట్లు మిథాలీ రాజ్ కొన్ని నెలల క్రితం తన కోరికను వ్యక్తం చేసింది.

1 / 5
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జట్ల ప్రకటనతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మహిళల క్రికెట్‌లో కొత్త శకాన్ని ప్రారంభించింది. ఇప్పుడు ఆటగాళ్ల వేలం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఇది మాత్రమే కాదు, మిథాలీ రాజ్ వంటి దిగ్గజ ప్లేయర్‌ను మరోసారి చూసే అవకాశం తమకు లభిస్తుందని భారత అభిమానులు ఆశిస్తున్నారు. కానీ అది జరిగేలా కనిపించడం లేదు.

2 / 5
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, వెటరన్ బ్యాట్స్‌మెన్ మితారీ రాజ్ డబ్ల్యూపీఎల్‌లో ఆడటం లేదు. క్రికెట్ నెక్స్ట్ నివేదిక ప్రకారం WPL మొదటి సీజన్‌లో మిథాలీ అహ్మదాబాద్ ఫ్రాంచైజీలో చేరనుంది.

3 / 5
నివేదిక ప్రకారం, WPL అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీగా మారిన అహ్మదాబాద్ (గుజరాత్ జెయింట్స్)తో మిథాలీ మెంటార్ పాత్రను పోషించనుంది.

4 / 5
మిథాలీ ఆడాలని కోరుకుంది. కానీ, నివేదికల ప్రకారం, ఐదు ఫ్రాంచైజీలలో ఎవరూ మిథాలీపై పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో, మిథాలీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

5 / 5
మిథాలీ మాత్రమే కాదు, భారత అభిమానులు కూడా వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామిని మళ్లీ చూడాలనుకుంటున్నారు. అయితే డబ్ల్యూపీఎల్‌లో ఆడబోనని జులాన్ స్వయంగా స్పష్టం చేసింది. ఇది రెండేళ్ల క్రితమే ప్రారంభమై ఉంటే, తాను ఆడేదానిని అంటూ ఝులన్ పేర్కొంది.