IND vs WI Live Streaming: వెస్టిండీస్‌తో టీమిండియా పోరు.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే?

|

Jul 04, 2023 | 10:01 AM

India Tour of West Indies: వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత క్రికెట్ జట్టు సిద్ధమైంది. వారం రోజుల ముందే కరేబియన్ దీవులకు చేరుకున్న టీమిండియా అక్కడ మూడు ఫార్మాట్లలో తలపడనుంది.

1 / 6
వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత క్రికెట్ జట్టు సిద్ధమైంది. వారం రోజుల ముందే కరేబియన్ దీవులకు చేరుకున్న టీమిండియా అక్కడ మూడు ఫార్మాట్లలో తలపడనుంది.

2 / 6
వెస్టిండీస్‌తో భారత్ 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్ ఆడనుంది. జులై 12 నుంచి సిరీస్ ప్రారంభం కానుంది.

3 / 6
అయితే ఇండియా వెస్టిండీస్ సిరీస్ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్, సోనీ నెట్‌వర్క్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయడం లేదని సమాచారం. బదులుగా, టీవీలో చూడాలనుకుంటే DD స్పోర్ట్స్‌లో మాత్రమే చూడవచ్చు.

4 / 6
అవును, భారత కరేబియన్ టూర్‌లోని టెస్ట్, వన్డే, టీ20 మ్యాచ్‌లు దూరదర్శన్ నెట్‌వర్క్ DD స్పోర్ట్స్‌లో మాత్రమే ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అంతే కాకుండా, ఆన్‌లైన్ వీక్షకులు జియో సినిమా, ఫ్యాన్‌కోడ్ యాప్ ద్వారా చూడవచ్చు.

5 / 6
జులై 12 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టు మ్యాచ్‌కు ముందు భారత జట్టు వార్మప్ మ్యాచ్ ఆడనుంది. జులై 6న స్థానిక జట్టుతో టీమ్ ఇండియా వార్మప్ మ్యాచ్ ఆడనుంది. దీని ద్వారా కరేబియన్ దీవుల పరిస్థితులకు తగ్గట్టుగా ప్రణాళిక రచించేందుకు ఆస్కారం ఉంది.

6 / 6
భారత్, వెస్టిండీస్ మధ్య స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. అయితే, ఇది భారతదేశంలో మాత్రం రాత్రి 7:30 కు మొదలుకానుంది. వన్డేలు సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఐదు టీ20 మ్యాచ్‌లు రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్నాయి.