క్రికెట్ అభిమానుల్లో చాలామందికి లలిత్ మోడీ పేరు బాగా గుర్తుంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ఆయనే ఆద్యుడు. అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయి ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటోన్న ఈ లలిత్ మళ్లీ వార్తల్లో నిలిచాడు. బాలీవుడ్ నటి సుస్మితాసేన్‌తో డేటింగ్‌లో ఉన్నానంటూ ఆయన చేసిన పోస్ట్ అటు బాలీవుడ్‌లో, ఇటు క్రికెట్ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.
లలిత్ మోడీ ప్రస్తుతం లండన్‌లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. ఇటీవల మాల్దీవుల వెకేషన్‌కు వెళ్లి లండన్‌కు తిరిగొచ్చిన ఆయన సుస్మితతో డేటింగ్‌లో ఉన్నానంటూ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
కొన్ని మీడియా నివేదికల ప్రకారం లలిత్ మోడీ నికర ఆస్తుల విలువ 57 మిలియన్ డాలర్లని తెలుస్తోంది. అంటే సుమారు రూ.4,555 కోట్లు. ఐపీఎల్ ఛైర్మన్‌గా కంటే ముందు లలిత్ ఓ బడా వ్యాపారి. 2002లో కేరళలో ఆన్‌లైన్ లాటరీ బిజినెస్‌ను కూడా నిర్వహించారు.
లలిత్ 2008 నుంచి 2010 వరకు ఐపీఎల్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా 2005 నుండి 2008 వరకు BCCIలో కీలకంగా వ్యవహరించారు. ఈ సమయంలో భారీగా ఆదాయం కూడా బెట్టారు.
లలిత్ మోడీ మొదటి భార్య పేరు మినల్ మోడీ. ఆమె అతని కంటే తొమ్మిదేళ్లు పెద్దది. వారిద్దరికీ ఒక కొడుకు, కూతురు ఉన్నారు. క్యాన్సర్ కారణంగా మినాల్ 2018 డిసెంబర్ లో మరణించారు.
అవినీతి ఆరోపణల్లో పూర్తిగా కూరుకుపోయిన మోడీని క్రికెట్‌కు సంబంధించిన అన్ని కార్యకలాపాల్లో పాల్గొనకుండా 2013లో BCCI జీవితకాల నిషేధం విధించింది. అప్పటి నుంచి లండన్‌లోనే తలదాచుకుంటున్నారు.