IPL 2025: మెగా వేలానికి ఆ స్టార్ పేసర్ సడెన్ ఎంట్రీ.. ఇది మాత్రం ఎవరూ ఊహించి ఉండరు..!

|

Nov 21, 2024 | 9:49 AM

జోఫ్రా ఆర్చర్ గతంలో రాజస్థాన్ రాయల్స్ మరియు ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. అయితే గాయం కారణంగా గత సీజన్‌లో ఆడలేదు. ఈసారి మెగా వేలానికి అతని పేరు వచ్చినప్పటికీ, షార్ట్ లిస్ట్‌లో అతని పేరు కనిపించలేదు.

1 / 5
IPL మెగా వేలం కోసం 574 మంది ఆటగాళ్లు షార్ట్‌లిస్ట్ అయ్యారు. ఇందులో ఇంగ్లండ్‌కు చెందిన 37 మంది ఆటగాళ్లు లీస్టులో కనిపించారు. కానీ ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ లేకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

2 / 5
ఐపీఎల్ మెగా వేలంలో జోఫ్రా ఆర్చర్‌కు తుది జాబితాలో చోటు దక్కలేదు. ఆర్చర్‌కి ఐపీఎల్‌లో ఆడేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అనుమతి ఇవ్వకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.

3 / 5
త్వరలో జరగనున్న టెస్టు సిరీస్‌పై దృష్టి సారించిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కొంతమంది ఆటగాళ్లకు ఎన్‌ఓసీలు జారీ చేసేందుకు నిరాకరించింది. దీంతో మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్ వంటి ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ల పేర్లు తుది జాబితాలో లేవు.

4 / 5
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తీరుపై జోఫ్రా ఆర్చర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. త్వరలో జరగనున్న మెగా వేలంలో పాల్గొనాలని కూడా భావిస్తున్నట్లు సమాచారం. జోఫ్రా ఆర్చర్ ఈసీబీతో చర్చించినట్లు తెలుస్తుంది. దీంతో  మెగా వేలంలో ఇంగ్లాండ్ పేసర్ పాల్గొనే అవకాశం లేకపోలేదు.

5 / 5
మెగా వేలానికి ముందే షార్ట్ లిస్ట్‌లో ఆటగాళ్ల పేర్లను చేర్చే అవకాశం ఉంది. జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్‌లో ఆడాలనుకుంటున్నందున చివరి క్షణంలో ఐపీఎల్ వేలం జాబితాలో అతని పేరు కనిపిస్తుందని క్రికెట్ బ్రాడ్‌కాస్టర్ మాట్ కబీర్ ఫ్లడ్ తెలిపారు. దీని ప్రకారం నవంబర్ 24, 25 తేదీల్లో జరగనున్న ఐపీఎల్ మెగా వేలంలో జోఫ్రా ఆర్చర్ 575వ ఆటగాడిగా కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు.