IPL 2025: అప్పుడు 20 లక్షలు.. ఇప్పుడు 14 కోట్లు.. నక్క తోక తొక్కిన గంభీర్ శిష్యుడు.. ఎవరంటే

|

Oct 23, 2024 | 8:01 PM

బూమ్.. బూమ్.. బుమ్రా 2.0, టీమిండియాకి భవిష్యత్తు ఆటగాడైన మయాంక్ యాదవ్ ఐపీఎల్‌లో నక్క తోక తొక్కాడు. గతేడాది రూ. 20 లక్షలు పలికిన ఈ ప్లేయర్.. ఇప్పుడు మెగా వేలానికి ముందుగా రూ. 14 కోట్లు అందుకోనున్నాడు. ఆ వివరాలు ఇలా..

1 / 5
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందుగా యువ పేసర్ మయాంక్ యాదవ్‌ను లక్నో సూపర్‌జెయింట్స్ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోనున్నట్టు తెలుస్తోంది. అది కూడా ఎవ్వరూ ఊహించనంతగా రూ. 14 కోట్లు ఇవ్వనుంది.

2 / 5
అవునండీ.! లక్నో సూపర్‌జెయింట్స్ ఫ్రాంచైజీ ఈ రైట్ ఆర్మ్ స్పీడ్‌స్టర్‌ను రెండవ ఎంపికగా రిటైన్ చేసుకోనుందట. మెగా వేలం రూల్స్ ప్రకారం.. మయాంక్ యాదవ్ రూ. 14 కోట్లు వేతనం అందుకోనున్నాడు.

3 / 5
ముందుగా అన్‌క్యాప్డ్ జాబితాలో అట్టిపెట్టుకోవాలని ఫ్రాంచైజీ భావించింది. కానీ బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా మయాంక్ యాదవ్ టీమ్ ఇండియా తరపున అరంగేట్రం చేశాడు. తద్వారా అతని కనీస ధర మొత్తం రూ.11 కోట్లకు చేరింది.

4 / 5
మయాంక్ యాదవ్ గత సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ తరఫున 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. దాదాపు 150 కిమీ బౌలింగ్ చేసిన మయాంక్ 73 బంతుల్లో 85 పరుగులు మాత్రమే ఇచ్చి మొత్తం 7 వికెట్లు పడగొట్టాడు. ఈ అద్భుతమైన ప్రదర్శన ఆధారంగా, లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ ఇప్పుడు యువ పేసర్‌ను కొనసాగించాలని నిర్ణయించుకుంది.

5 / 5
మయాంక్ యాదవ్‌తో పాటు, లక్నో సూపర్‌జెయింట్స్ ఫ్రాంచైజీ నికోలస్ పూరన్, యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌లను అట్టిపెట్టుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. సో ఈ మెగా వేలంలో పూరన్ కనిపించడనే చెప్పాలి.