IPL 2024: ముంబై ఇండియన్స్ జట్టులోకి లసిత్ మలింగ రీ-ఎంట్రీ.. రోహిత్ ఖాతాలో మరో టైటిల్ పడినట్లే..
Mumbai Indians, Lasith Malinga: ముంబై ఫ్రాంచైజీ ఇప్పటికే వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది. ఈ క్రమంలో శ్రీలంక లెజెండరీ పేసర్ లసిత్ మలింగ బౌలింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. 2008 నుంచి 2020 వరకు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ జట్టు తరపున 122 మ్యాచ్‌లు ఆడిన మలింగ 170 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు.