
మరి కొద్ది సేపట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ప్రారంభమవుతుంది. ఈ ధనాధన్ లీగ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఆటతో పాటు గ్లామర్ పరంగానూ ఐపీఎల్ ఎంతో ఫేమస్. ఈ సారి ఐపీఎల్ ది మోస్ట్ స్టైలిష్ క్రికెటర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా అందరికంటే ముందున్నాడు.

లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా ఫ్యాషన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా పేరు పొందాడు. తన స్టైలిష్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇంగ్లిష్ ఆల్‌రౌండర్ సామ్ కరణ్ చాలా ఖరీదైన ప్లేయర్. స్టైల్ విషయంలో హీరోలకు ఏ మాత్రం తీసిపోడీ యంగ్ క్రికెటర్

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కెమరూన్ గ్రీన్ ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రెండో స్థానంలో ఉన్నాడు. ఇతని ఫ్యాషన్ సెన్స్ కూడా ఎంతో సూపర్‌గా ఉంటుంది.

ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ లుక్స్ లో హాలీవుడ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోడు. ఈసారి అతను చెన్నై జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు.