IPL 2023: హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హోమ్ టీమ్ 8 వికెట్ల తేడాతో.. టోర్నీలో తొలి విజయాన్ని సాధించింది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఓపెనర్ శిఖర్ ధావన్ అజేయంగా 99 చేశాడు.
ఈ మ్యాచ్‌లో తనతోపాటు ఓపెనర్‌గా వచ్చిన ప్రభ్‌సిమ్రాన్ నుంచి.. 11వ ప్లేయర్‌గా వచ్చిన మోహిత్ రథీ వరకు అందరితోనూ ధావన్ భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాడు. ముఖ్యంగా 11వ ఆటగాడిగా క్రీజులోకి వచ్చిన రథీతో కలిసి ధావన్ 10వ వికెట్‌కి 55 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇది కూడా ఒక రికార్డు.
ఇక IPL చరిత్రలో ఓపెనర్‌గా ఫీల్డ్‌లోని ఆటగాళ్లందరితో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్న బ్యాట్స్‌మ్యాన్ లిస్టులో ధానవ్ 2వ ప్లేయర్‌గా నిలిచాడు. అంటే ధావన్ కంటే ముందు ఒకరు మాత్రమే అలా చేశారు.
అవును, ధావన్ కంటే ముందుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ ఆటగాడు పార్థివ్ పటేల్ మాత్రమే ఈ అరుదైన లిస్టులో ఉన్నాడు. 2019 ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీకి శుభారంభం ఇచ్చిన పార్థివ్ పటేల్ చివరి వరకు క్రీజులోనే ఉన్నాడు. తనతో పాటు వచ్చిన ఓపెనర్ నుంచి నిలిచి 11వ ఆటగాడు మహ్మద్ సిరాజ్ వరకు అందరితోనూ జతకట్టాడు.
తద్వారా ఐపీఎల్ చరిత్రలో ఎపెనర్‌గా వచ్చి, అందరితోనూ భాగస్వామ్యం కలిగినే ఓకే ఒక్క ప్లేయర్‌గా ఇంతకాలం కొనసాగాడు పార్థివ్. ఇక తాజాగా పంజాబ్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన శిఖర్ ధావన్ 66 బంతుల్లో అజేయంగా 99 పరుగులు చేసి 11వ బ్యాట్స్‌మెన్‌తో టీమ్ ఇన్నింగ్స్ ముగించాడు. అలా పార్థివ్ పటేల్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా ఐపీఎల్ రికార్డుల్లో నిలిచాడు.