
Sanju Samson Half Century: ఐపీఎల్ 16వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడి, 72 పరుగులతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అద్భుతమైన లయలో కనిపించాడు. ఐపీఎల్ 2023 తొలి మ్యాచ్‌లో సంజూ శాంసన్ 28 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.

ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో సంజు అర్ధశతకం సాధించడం ఇదే తొలిసారి కాదు. గత నాలుగైదేళ్లుగా ఇలాంటి ఇన్నింగ్స్‌లతో దంచికొడుతున్నాడు. ఇందులో ఓసారి సెంచరీ ఇన్నింగ్స్ కూడా ఆడాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. ఈ మ్యాచ్‌లో శాంసన్ 171.88 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ 32 బంతుల్లో 55 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.

IPL 2020 నుంచి 2023 వరకు, నాలుగు సంవత్సరాలలో సంజు శాంసన్ టోర్నమెంట్ అన్ని ప్రారంభ మ్యాచ్‌లలో 50 పరుగుల మార్క్‌ను దాటాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన IPL 2021 ప్రారంభ మ్యాచ్‌లో సెంచరీ కూడా అతని పేరిట ఉంది.

2020లో CSKపై 32 బంతుల్లో 74 పరుగులు చేసిన శాంసన్.. 2021లో పంజాబ్ కింగ్స్‌పై 63 బంతుల్లో 119 పరుగులు చేశాడు. అలాగే 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 27 బంతుల్లో 55 పరుగులు, 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 32 బంతుల్లో 55 పరుగులతో ఆకట్టుకున్నాడు.