IPL 2022: వేలంలో మిలియనీర్లు.. ఆటలో మాత్రం చిల్లర పైసలే.. కట్ చేస్తే.. ప్లేయింగ్ XI నుంచి ఔట్..

|

Apr 26, 2022 | 6:18 AM

వీళ్ల ధర కోట్లలో ఉంది. కానీ, ఆటకు మాత్రం చిల్లర పైసల మాదిరి సాగుతోంది. IPL 2022లో, ఈ ఆటగాళ్లు ఖరీదైన వాళ్లుగా మారారు. అయితే, ఆయా జట్లకు మాత్రం భారంగా మారారు. వీరి కోసం ఫ్రాంచైజీలు వెచ్చించిన సొమ్ములో సగం కూడా ఫలితం చూపించడం లేదు.

1 / 8
వీళ్ల ధర కోట్లలో ఉంది. కానీ, ఆటకు మాత్రం చిల్లర పైసల మాదిరి సాగుతోంది. IPL 2022లో, ఈ ఆటగాళ్లు ఖరీదైన వాళ్లుగా మారారు. అయితే, ఆయా జట్లకు మాత్రం భారంగా మారారు. వీరి కోసం ఫ్రాంచైజీలు వెచ్చించిన సొమ్ములో సగం కూడా ఫలితం చూపించడం లేదు. దీంతో వీరిని ప్లేయింగ్ ఎలెవన్ నుంచి బయటకు మార్గం చూపించేందుకు సిద్ధమయ్యాయి. టీమ్‌కి దూరంగా ఉన్న ఈ మిలియనీర్ ఆటగాళ్లలో రిటైన్ అయిన వారు కూడా ఉన్నారు.

2 / 8
వెస్టిండీస్‌కు చెందిన ఓడిన్ స్మిత్ పంజాబ్ కింగ్స్ జట్టుతో ఉన్నాడు. నిన్న చెన్నైతో జరిగిన మ్యాచ్‌‌లో ప్లేయింగ్ ఎలెవన్‌ నుంచి ఔటయ్యాడు. కోటి రూపాయల బేస్ ధరతో బరిలోకి దిగిన ఈ ప్లేయర్‌ను.. పంజాబ్ ఫ్రాంచైజీ రూ. 6 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే ఈ సీజన్‌లో అతని ఒక్కో వికెట్‌ జట్టుకు కోటి రూపాయలని నిరూపించింది. అంటే ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు మాత్రమే తీశాడు.

3 / 8
కోటి రూపాయలు చెల్లించి దక్షిణాఫ్రికా బౌలర్ ఎన్రిక్ నోర్కియాను ఢిల్లీ క్యాపిటల్స్ తన వద్ద ఉంచుకుంది. కానీ, ఢిల్లీ జట్టు ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడగా, నార్కియా ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. అందులోనూ వికెట్లేమీ తీయకుండానే భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.

4 / 8
అబ్దుల్ సమద్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.4 కోట్లకు అట్టిపెట్టుకుంది. కానీ, ఈ సీజన్‌లో 2 మ్యాచ్‌లు ఆడిన తర్వాత, ఫ్రాంచైజీ అతన్ని ప్లేయింగ్ XI నుంచి తొలగించింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో అతను కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు.

5 / 8
ప్లేయింగ్ XI నుంచి తొలగించబడిన మిలియనీర్ ఆటగాళ్లలో షారుక్ ఖాన్ పేరు కూడా చేరింది. గత సీజన్‌లో అతని ప్రదర్శన ఆధారంగా పంజాబ్ కింగ్స్ ఈ ఆటగాడికి రూ. 40 లక్షల ప్రాథమిక ధరతో ఎంట్రీ ఇవ్వగా.. రూ. 9 కోట్లకు దక్కించుకుంది. కానీ ఆటలో మాత్రం.. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 98 పరుగులు మాత్రమే చేసి, తీవ్రంగా నిరాశపరిచాడు.

6 / 8
పాట్ కమిన్స్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ గత వేలం కంటే ఈసారి సగం ధరకు కొనుగోలు చేసింది. కానీ, ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ తప్ప, మిగిలిన మూడింట్లో ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాడు. ఫలితంగా KKR కేవలం 4 మ్యాచ్‌లు ఆడిన అతనిని ప్లేయింగ్ XI నుంచి తొలగించింది. ఆ 4 మ్యాచ్‌ల్లో 63 పరుగులు చేసి 4 వికెట్లు తీశాడు.

7 / 8
CSK కూడా కోటి రూపాయలకు మొయిన్ అలీని అట్టిపెట్టుకుంది. కానీ ప్రస్తుతం అతను IPL ఎల్లో జెర్సీ జట్టు ప్లేయింగ్ XI నుంచి ఔటయ్యాడు. మొయిన్ అలీ ఈ సీజన్‌లో ఇప్పటివరకు CSK తరపున 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. బ్యాట్‌తో 87 పరుగులు చేశాడు. ఇక బంతితో వికెట్లు తీయడంలో విఫలమయ్యాడు.

8 / 8
టిమ్ డేవిడ్‌ను ముంబై ఇండియన్స్ రూ. 8 కోట్లకు పైగా చెల్లించి కొనుగోలు చేసింది. టిమ్ డేవిడ్ కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడి కేవలం 13 పరుగులు మాత్రమే చేశాడు.