కొంతకాలం తర్వాత అబుదాబిలో అలజడి మొదలుకానుంది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచులో విజయం ఆర్‌ఆర్ టీంకు చాలా కీలకం. దీంతో నేటి పోరాటం తీవ్రంగా ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కమాండింగ్ పొజిషన్‌లో ఉన్నప్పటికీ, పలు ఆటగాళ్లకు విశ్రాంతిని ఇవ్వాలనుకోవడం లేదు. నేటి మ్యాచ్‌లో కొన్ని రికార్డులు నెలకొల్పేందుకు ఆటగాళ్లు సిద్ధమయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన అశ్విన్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ఈలిస్టులో ముందున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఓ మైలురాయిని తాకడానికి కేవలం ఒక అడుగు దూరంలో ఉన్నారు. అవేంటో చూద్దాం.
ఒక వికెట్ దూరంలో ఆర్ అశ్విన్: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ అశ్విన్ టీ20 క్రికెట్‌లో 250 వికెట్లకు కేవలం ఒక వికెట్ దూరంలో ఉన్నాడు. ఈరోజు అతను రాజస్థాన్ రాయల్స్‌పై ఒక వికెట్ తీస్తే టీ20 లో 250 వికెట్లు తీసిన మూడవ భారతీయుడుగా మారనున్నాడు. అమిత్ మిశ్రా, పీయూష్ చావ్లా అంతకు ముందు ఈ స్థానాన్ని చేరుకున్నారు.
ఒక సిక్స్ దూరంలో సంజు శాంసన్: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ పేరు మీద ఇప్పటి వరకు 99 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచులో మరో సిక్స్ కొడితే.. ఐపీఎల్‌లో 100 సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్ జాబితాలో చేరనున్నాడు. షేన్ వాట్సన్ తర్వాత రాజస్థాన్ తరఫున 100 సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా మారనున్నాడు.