India VS West Indies, 2nd T20I: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో శుక్రవారం భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన వెస్టిండీస్‌కి ఈ మ్యాచ్ డూ ఆర్ డై అనే చెప్పాలి. తొలి విజయాన్ని రెండో మ్యాచ్‌లోనూ పునరావృతం చేయాలని, సిరీస్‌ని కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. అయితే మ్యాచ్‌కు ముందు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఏమైనా మార్పు ఉంటుందా? రితురాజ్ గైక్వాడ్, అవేశ్ ఖాన్‌లకు అవకాశం దక్కుతుందా అనేది ప్రశ్నగా మారింది.
వన్డే సిరీస్‌లో గైక్వాడ్ కూడా టీమిండియాలో భాగమే. అయితే అతనికి అవకాశం రాలేదు. మొదటి రెండు మ్యాచ్‌లలో, అతను కరోనా కారణంగా ఆడలేకపోయాడు. మూడవ మ్యాచ్‌లో అతను బెంచ్‌పై కూర్చున్నాడు. టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో కూడా గైక్వాడ్‌కు అవకాశం రాలేదు. గైక్వాడ్ ఫామ్ అద్భుతంగా ఉంది. కానీ, అతను బెంచ్‌పై కూర్చున్నాడు. తొలి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 35 పరుగులతో నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆడగా, కెప్టెన్ రోహిత్ శర్మ తన ఓపెనింగ్ భాగస్వామిని మారుస్తాడా అనేది ఇక్కడ ప్రశ్నగా నిలిచింది.
కాగా, అంతర్జాతీయ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న అవేష్ ఖాన్ గురించి కూడా ప్రశ్నలు మొదలయ్యాయి. వన్డే సిరీస్‌లో కూడా అతనికి అవకాశం లభించలేదు. మొదటి టీ20లో కూడా ఆడలేదు. అవేష్ ఖాన్‌కి అవకాశం వస్తుందా? లేదా భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్ త్రయంతో టీమిండియా రంగంలోకి దిగుతుంది.
కాగా, రోహిత్ శర్మ ఎలాంటి మార్పులు లేకుండా రెండో టీ20కి వెళ్లవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే భువనేశ్వర్ కుమార్, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్ లకు ఇప్పుడు మరిన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి. బెంచ్‌పై కూర్చున్న ఆటగాళ్లను శ్రీలంకతో జరిగే సిరీస్‌లో కూడా ప్రయత్నించే అవకాశం ఉంది.
భారత ప్రాబబుల్ ప్లేయింగ్ XI - రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్.