Rohit Sharma: కోహ్లీ, ధోనిలకు సాధ్యం కాని రికార్డుపై కన్నేసిన హిట్ మ్యాన్.. ఒక్క సెంచరీ చేస్తే లెక్కలు మారాల్సిందే..!

|

Feb 08, 2023 | 10:31 AM

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్టు సిరీస్ ద్వారా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకునేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సిద్ధమయ్యాడు. విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని లాంటి ప్లేయర్లకు కూడా సాధ్యం కాని రికార్డును తన సొంతం చేసుకోవాలని రోహిత్ చూస్తున్నాడు.

1 / 8
 క్రికెట అభిమానులను అలరించేందుకు ఆసక్తికర సిరీస్ రెడీ అయ్యింది. ఫిబ్రవరి 9 నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు తెర లేవనుంది.

2 / 8
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగబోయే తొలి టెస్టు మ్యాచ్‌కు నాగ్‌పూర్ వేదికగా మారనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు కూడా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గత కొన్నేళ్ల నుంచి బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో భారత్‌దే హవా. అయితే ఈసారి భారత్‌కు గట్టి పోటీ ఇవ్వాలనే పట్టుదల మీద ఆసీస్ ఉంది.

3 / 8
 అయితే ఈ టెస్టు సిరీస్ ద్వారా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకునేందుకు టీమిండియా  కెప్టెన్ రోహిత్ శర్మ సిద్ధమయ్యాడు. విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని లాంటి ప్లేయర్లకు కూడా సాధ్యం కాని రికార్డును తన సొంతం చేసుకోవాలని రోహిత్ చూస్తున్నాడు.

4 / 8
 ఆస్ట్రేలియాతో జరగబోయే నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో రోహిత్ ఒక్క సెంచరీ బాదితే చాలు.. కోహ్లీ, ధోనిలకు సాధ్యం కాని దానిని సాధించిన తొలి భారత కెప్టెన్ నిలుస్తాడు. ప్రస్తుతం రోహిత్ కెప్టెన్‌గా వన్డే, టీ20ల్లో సెంచరీలు బాదాడు. కానీ, టెస్టుల్లో మాత్రం కెప్టెన్ హోదాలో సెంచరీ కొట్టలేదు.

5 / 8
 ఇక కోహ్లీ, ధోని కూడా కెప్టెన్‌గా వన్డే, టెస్టు సెంచరీలు బాదారే తప్ప.. టీ20ల్లో కెప్టెన్‌గా సెంచరీ కొట్టలేదు. కోహ్లీ గతేడాది జరిగిన ఆసియాకప్‌లో సెంచరీ బాదినా.. అది కెప్టెన్ హోదాలో కాదు.

6 / 8
కానీ కోహ్లీ గైర్హాజరీలో టీమిండియా తాత్కలిక సారథిగా జట్టును నడిపించిన రోహిత్.. 2017లో శ్రీలంకపై జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 43 బంతుల్లో 118, 2018లో వెస్టిండీస్‌పై జరిగిన టీ20లో 61 బంతుల్లో 111 పరుగు చేశాడు.అలాగే వన్డేల్లో కూడా ఇటీవలె కివీస్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో శతకం బాదాడు హిట్ మ్యాన్.

7 / 8
ఆస్ట్రేలియాతో జరిగే ఈ టెస్టు సిరీస్‌ రోహిత్ శర్మకు అసలు సిసలు పరీక్ష లాంటిది. టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న తర్వాత శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి బలహీన జట్లపై మాత్రమే రోహిత్ కెప్టెన్సీ చేశాడు. సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌లతో జరిగిన టెస్టు మ్యాచ్‌లకు గాయం, కరోనా వంటి కారణాలతో దూరంగా ఉన్నాడు.

8 / 8
ఈ క్రమంలో రోహిత్ టెస్టు కెప్టెన్సీకి ఇదొక పరీక్ష లాంటిది. వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో భారత్ ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియాపై తప్పక నెగ్గాలి. ప్రస్తుతం రోహిత్ మీదున్న అతి పెద్ద బాధ్యత ఇదే.