Australia Women: ఆమె కెప్టెన్సీ అంటేనే ప్రత్యర్థులకు వణుకు.. వరల్డ్‌కప్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడలే.. రికార్డులు చూస్తే దడ పుట్టాల్సిందే..

|

Apr 03, 2022 | 4:59 PM

ఆదివారం మెగ్ లానింగ్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్‌ను ఓడించి ఐసీసీ మహిళల ప్రపంచకప్ టైటిల్‌ను ఏడోసారి గెలుచుకుంది.

1 / 4
లానింగ్ కెప్టెన్ అయ్యాక ఆస్ట్రేలియా ఓడిపోవడం మరిచిపోయింది. ప్రతి టోర్నీలో, ప్రతి సిరీస్‌లోనూ సత్తా చాటుతూ తన విజయాలను మరింతగా పెంచుకుంటూ దూసుకపోతోంది. ఈ క్రెడిట్ అంతా ఆసీస్ ఉమెన్స్ కెప్టెన్ మెగ్ లానింగ్‌కు చెందుతుంది. ఏడేళ్లలో, లానింగ్ టీ20 ప్రపంచకప్, ప్రపంచకప్, యాషెస్ వంటి పెద్ద ట్రోఫీలన్నింటినీ ఈ జట్టుకు అందించింది.

2 / 4
మహిళల క్రికెట్‌లో బలమైన, విజయవంతమైన ఆస్ట్రేలియా జట్టు ఆదివారం మరో ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది. ఇంగ్లండ్‌ను ఓడించి ఆస్ట్రేలియా ఏడోసారి ఈ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ విజయంతో ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ విజయాల జాబితాలో మరో ప్రపంచకప్ టైటిల్ చేరిపోయింది. మెగ్ లానింగ్ కెప్టెన్సీలో ఉన్న ఈ ఆస్ట్రేలియా జట్టును ఓడించడం అన్ని జట్లకు అసాధ్యంగానే మారింది.

3 / 4
లానింగ్ 19 సంవత్సరాల వయస్సులో AJ బ్లాక్‌వెల్ కెప్టెన్సీలో ఆమె అరంగేట్రం చేసింది. నాలుగేళ్ల తర్వాత, జట్టు కెప్టెన్సీని లానింగ్‌కు అప్పగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు లానింగ్ కెప్టెన్సీలో 74 వన్డేలు ఆడింది. ఈ 74 మ్యాచ్‌ల్లో ఆ జట్టు 65 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఎనిమిదింటిలో మాత్రమే ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మెగ్ లానింగ్ టీమ్ ఎందుకు విజయవంతమైందో చెప్పడానికి ఈ రికార్డులే సరిపోతాయి.

4 / 4
లానింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా జట్టు 2020లో భారత్‌ను ఓడించి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది. మొత్తం క్యాంపెయిన్‌లో ఆస్ట్రేలియా జట్టు ఒకే ఒక్క ఓటమిని చవిచూసింది. ఈసారి కూడా మాగ్ లానింగ్ జట్టు ప్రపంచకప్‌లో అజేయంగా నిలిచింది. సెమీ-ఫైనల్స్, ఫైనల్స్ కాకుండా లీగ్ రౌండ్‌లోని ఏడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది.