
వన్డే ప్రపంచకప్ 2023 తుది దశకు చేరుకుంది. కేవలం మూడు మ్యాచ్‌ల్లో ఈసారి టైటిల్ విజేత ఎవరన్నది తేలిపోతుంది. నవంబర్ 15న ఇండియా, న్యూజిలాండ్ మధ్య మొదటి సెమీఫైనల్ జరగ్గా.. నవంబర్ 16న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇదిలా ఉంటే.. ఈసారి వన్డే వరల్డ్‌కప్ విజేతగా నిలవనున్న జట్టు ఏకంగా జాక్‌పాట్ కొట్టనుంది.

వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న జరగనుంది. ఈ ప్రపంచకప్‌కు ఐసీసీ మొత్తంగా సుమారు రూ. 83 కోట్లు కేటాయించింది. ఫైనల్‌లో గెలిచిన టీం సుమారు రూ. 33 కోట్ల జాక్‌పాట్ అందుకోనుంది. రన్నరప్‌కి రూ. 16 కోట్లు, సెమీఫైనల్‌లో ఓడిన జట్లకు రూ. 6 కోట్ల చొప్పున దక్కనుంది.

ఇక సెమీఫైనల్‌కు అర్హత సాధించలేకపోయిన మిగిలిన 6 జట్లకు రూ. 84 లక్షలు అందుతాయి. అలాగే గ్రూప్ దశలో ప్రతి విజయానికి రూ. 33 లక్షలు లభిస్తాయి.

ఈ లెక్కన టీమిండియా లీగ్ దశలో 9 మ్యాచ్‌లలోనూ గెలవగా.. ఇప్పటికే రూ. 2.97 కోట్లు అందుకుంది. అలాగే సెమీస్‌కు చేరడంతో మరో రూ. 6 కోట్లు లభించింది.

ఒకవేళ టీమిండియా మొదటి సెమీఫైనల్‌లో గెలిచి.. ఫైనల్‌కు వెళ్తే.. రూ. 33 కోట్ల జాక్‌పాట్ దక్కనుంది. ఇక సెమీఫైనల్ ఫోబియా నుంచి టీమిండియా విజయం సాధించాలని.. అభిమానులు కోరుకుంటున్నారు.