
వరల్డ్ కప్ 1975: తొలి వరల్డ్ కప్ టోర్నీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన వెస్టిండీస్ విజేతగా నిలిచింది.

వరల్డ్ కప్ 1979: రెండో ఎడిషన్ వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగిన వెస్టిండీస్ రెండో సారి కూడా టైటిల్ విన్నర్‌గా నిలిచింది.

వరల్డ్ కప్ 1983: భారత క్రికెట్ అభిమానులు ఎన్నటికీ మర్చిపోలేని ఎడిషన్ ఇది. 1983 వరల్డ్ కప్ టోర్నీ విన్నర్‌గా అవతరించిన కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత్.. అంతర్జాతీయ క్రికెట్‌లో వెస్టిండీస్ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసింది.

వరల్డ్ కప్ 1987: అల్లన్ బోర్డర్ నాయకత్వంలోని 1987 నాటి ఆసీస్ జట్టు నాలుగో ఎడిషన్ వరల్డ్ కప్‌ని గెలుచుకుంది.

వరల్డ్ కప్ 1992: ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు వరల్డ్ కప్ 1992 టోర్నీ టైటిల్‌ని గెలుచుకుంది.

వరల్డ్ కప్ 1996: ఆస్ట్రేలియాతో జరిగిన 1996 వరల్డ్ కప్ పైనల్‌లో అర్జున్ రణతుంగ నేతృత్వంలోని శ్రీలంక తొలి సారి కప్ గెలుచుకుంది.

వరల్డ్ కప్ 1999: ఇంగ్లాండ్ వేదికగా జరిగిన 1999 వరల్డ్ కప్ టోర్నీ ఫైనల్‌లో పాకిస్తాన్‌ని ఓడించి టైటిల్‌ని రెండో సారి గెలుచుకుంది ఆస్ట్రేలియా.

వరల్డ్ కప్ 2003: రికీ పాంటింగ్ నేతృత్వంలోని ఆసీస్ 2003 వరల్డ్ కప్ ఫైనల్‌లో విజయం సాధించి.. తన ఖాతాలో మూడో కప్‌ని వేసుకుంది.

వరల్డ్ కప్ 2007: వరుసగా రెండు సార్లు టైటిల్ గెలిచిన ఆసీస్ 2007 వరల్డ్ కప్ టోర్నీని కూడా గెలుచుకుంది.

వరల్డ్ కప్ 2011: ఇప్పటి క్రికెట్ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోయే టోర్నీ ఇది. భారత్ వేదికగా జరిగిన 2011 వరల్డ్ కప్‌లో లంకను ఓడించి మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని టీమిండియా రెండో సారి కప్ గెలుచుకుంది.

వరల్డ్ కప్ 2015: మైకెల్ క్లార్క్ నాయకత్వంలో ఆస్ట్రేలియా ఐదో సారి వరల్డ్ కప్ విజేతగా నిలిచింది.

వరల్డ్ కప్ 2019: క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్‌లోనే అంటారు కానీ.. వరల్డ్ కప్ గెలుచుకునేందుకు ఇంగ్లీష్ టీమ్‌కి 12వ ఎడిషన్‌లో సాధ్యమైంది.