ఐపీఎల్ 2021 కోసం అన్ని జట్లు, వారి ఆటగాళ్లతో యూఏఈకి చేరుకున్నాయి. కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికే చేరుకుని, ప్రాక్టీస్ కూడా ప్రారంభించారు. కొంతమంది ఆటగాళ్లు ఇటీవల వచ్చారు. ప్రస్తుతం వారు క్వారంటైన్‌లో ఉన్నారు. వెస్టిండీస్‌లో కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న ఆటగాళ్ల కోసం ఇంకా ఎదురుచూస్తున్నారు. సీపీఎల్‌లో సెమీ-ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇవి పూర్తయిన వెంటనే, క్రీడాకారులు నేరుగా యూఏఈకి చేరుకుంటారు. సీపీఎల్‌లో ఆడే ఆటగాళ్లను క్వారంటైన్ ఉంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు ఒక బయో బుడగ నుంచి మరొకదానికి బదిలీ కానున్నారు. ఐపీఎల్ 2021 లో వెస్టిండీస్ నుంచి ప్రధాన ఆటగాళ్లతో పాటు, నెట్ బౌలర్లు కూడా వస్తున్నారు. అయితే, నెట్ బౌలర్లుగా ఈ టోర్నమెంట్‌లో భాగంగా ఉండే వారిలో కీలక ప్లేయర్లు కూడా ఉండడం గమనార్హం. వీరిలో ఫిడెల్ ఎడ్వర్డ్స్, రవి రాంపాల్, షెల్డన్ కాట్రెల్, డొమినిక్ డ్రేక్స్ వంటి బౌలర్ల పేర్లు కూడా ఉన్నాయి.