
మంగళవారం పెర్త్‌లో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించి ఐసీసీ టీ20 ప్రపంచ కప్-2022లో ఆస్ట్రేలియా తన ఖాతాను తెరిచింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఇబ్బందికరంగా కనిపించింది. ఏ టీమ్ చేయకూడని పనిని చేయడంతో, ఓ చెత్త రికార్డులో చేరింది.

ఆస్ట్రేలియా ముందు శ్రీలంక 158 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. T20లో మొదటి ఆరు ఓవర్ల పవర్‌ప్లే చాలా కీలకమైనది. ప్రతి జట్టు అందులో గరిష్టంగా పరుగులు సాధించడానికి ప్రయత్నిస్తుంది. ఫోర్లు, సిక్స్‌లు కొట్టడానికి ప్రయత్నిస్తుంది. అయితే శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పవర్‌ప్లేలో ఆస్ట్రేలియా జట్టు బ్యాట్స్‌మెన్స్ ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయారు.

పవర్‌ప్లే ఉన్న ఆరు ఓవర్లలో ఆస్ట్రేలియా ఒక వికెట్ నష్టానికి 33 పరుగులు మాత్రమే చేసింది. ఈ ఒక్క వికెట్ డేవిడ్ వార్నర్‌ది. పవర్‌ప్లే ముగిసినప్పుడు, మిచెల్ మార్ష్, కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఆడుతున్నారు. కానీ ఈ ముగ్గురి బ్యాటర్స్ కూడా ఒక్క ఫోర్ లేదా సిక్స్ బాదలేకపోయారు.

ఫించ్, వార్నర్ వంటి తుఫాను ఓపెనర్లు ఉండగా, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ టీ20 ఇంటర్నేషనల్‌లో పవర్‌ప్లేలో ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోవటం ఇదే మొదటిసారి. ఆసీస్ ఖాతాలో అదనపు పరుగుల రూపంలో రెండు బౌండరీలు ఉన్నప్పటికీ బ్యాట్స్‌మెన్ కొట్టినవి కాదు.

అదే సమయంలో టీ20 ప్రపంచకప్‌లో పవర్‌ప్లేలో ఏ జట్టు బ్యాట్స్‌మెన్ కూడా తమ బ్యాట్‌తో బౌండరీ బాదకపోవడం ఇది మూడోసారి.

గతంలో 2014 ప్రపంచకప్‌లో పాకిస్థాన్, వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇదే జరిగింది. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఈ పని చేసింది. గతేడాది పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇదే జరిగింది.