Asian Games 2023: ఆసియా క్రీడల్లో 12 సిక్సర్లతో నేపాలీ బ్యాటర్ విధ్వంసం.. దెబ్బకి మిల్లర్, రోహిత్ రికార్డ్‌లు గల్లంతు..

|

Sep 27, 2023 | 2:59 PM

Asian Games 2023: చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో నేపాల్, మంగోలియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో నేపాలీ యువ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. కుశల్ మల్ల 137*, రోహిత్ పౌడెల్ 61, దీపేంద్ర సింగ్ 52* పరుగులతో నేపాల్‌కి భారీ స్కోర్ అందించారు. అయితే కుశల్ మల్ల తన తొలి టీ20 సెంచరీతోనే డేవిడ్ మిల్లర్, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్ల పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డ్‌ను తన సొంతం చేసుకున్నాడు.

1 / 5
NEP vs MGL: నేపాలీ బ్యాటర్ కుశల్ మల్ల మంగోలియాపై రెచ్చిపోయాడు. ఆసియా క్రీడల్లో భాగంగా మంగోలియాతో జరిగిన ప్రారంభ టీ20 మ్యాచ్‌లో అతను 50 బంతుల్లోనే 8 ఫోర్లు, 12 సిక్సర్లతో అజేయంగా 137 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కుశల్ 34 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకోవడం గమనార్హం.

2 / 5
అంతర్జాతీయ క్రికెట్‌లో నేపాల్ తరఫున 16వ టీ20 ఆడుతున్న కుశల్ 34 బంతుల్లోనే సెంచరీ చేయడమే కాక ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా శతకం బాదిన ఆటగాడిగా అవతరించాడు.

3 / 5
నిజానికి ఇంతక ముందు ఈ రికార్డ్  డేవిడ్ మిల్లర్(సౌతాఫ్రికా), రోహిత్ శర్మ(భారత్), సుదేశ్ విక్రమసేకర(సీజెక్ రిపబ్లిక్) పేరిట ఉండేది. వీరంతా 35 బంతుల్లోనే అంతర్జాతీయ టీ20 సెంచరీ నమోదు చేశారు. కానీ తాజాగా ఆ రికార్డ్‌ను 34 బంతుల్లోనే సెంచరీ సాధించిన కుశల్ మల్ల సొంతం చేసుకున్నాడు.

4 / 5
విశేషం ఏమిటంటే.. 137 పరుగులు చేసిన కుశల్ మల్లతో పాటు కెప్టెన్ రోహిత్ పౌడెల్ 61 , దీపేంద్ర సింగ్ 52* కూడా రాణించడంతో మంగోలియాపై నేపాల్ 3 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఇది టీ20 ఫార్మాట్‌లో అత్యధిక స్కోర్.

5 / 5
కాగా, నేపాల్ ఇచ్చిన భారీ స్కోర్‌తో బరిలోకి దిగిన మంగోలియా 41 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో నేపాల్ ఏకంగా 273 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయం సాధించింది.