Meal Maker Recipe: మటన్‌ను తలదన్నే రుచితో మీల్‌ మేకర్ మసాలా కర్రీ.. ఇలా చేస్తే క్షణాల్లో ప్లేటు ఖాళీ

Updated on: Nov 24, 2026 | 10:43 AM

నాన్‌వెజ్ తినని వారికి మంచి ప్రోటిన్ కావాలంటే పనీర్ లేదా మీల్‌ మేకర్ బెస్ట్ ఆప్షన్.. అయితే రుచిలో నాన్ వెజ్ వంటకాలతో పోటీపడేది మాత్రం మీల్‌ మేకర్ మాత్రమే.. సరైన విధానంలో దీన్ని వండితో జీరా రైస్, బిర్యానీ, బగారా రైస్, చపాతీ, పుల్కా వంటి వాటిల్లోకి ఇది అత్యద్భుతమైన కాంబినేషన్. కాబట్టి ఈ అద్భుతమైన వంటకాన్ని ఇంట్లోనే ఈజీగా కొత్తగా ఎలా తయారుచేయాలో చూద్దాం.

1 / 5
మొదటగా, ఒక గిన్నెలో ఒక లీటరు నీళ్లు తీసుకొని బాగా మరగనివ్వండి. నీళ్లు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఒక కప్పు మీల్ మేకర్ వేసి ఐదు నిమిషాలు నాననివ్వండి. ఐదు నిమిషాల తర్వాత నీళ్లన్నీ వడకట్టి, మీల్ మేకర్ వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా చన్నీళ్లు పోసి గట్టిగా పిండండి. ఇలా పిండిన మీల్ మేకర్ ను పక్కన పెట్టుకోండి. చిన్న సైజు మీల్ మేకర్ వాడటం మంచిది.

2 / 5
ఇప్పుడు ఒక పాన్ వేడి చేసి రెండు టేబుల్ స్పూన్ల బటర్ వేయండి. బటర్ కరిగిన తర్వాత, పిండి పెట్టుకున్న మీల్ మేకర్‌ను వేసి, మీడియం ఫ్లేమ్‌లో రెండు నుండి మూడు నిమిషాలు, లేత రంగు మారే వరకు వేయించుకోండి. ఇలా వేయించడం వల్ల మీల్ మేకర్ రుచి మరింత పెరుగుతుంది. వేయించిన మీల్ మేకర్ ను ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టుకోండి.

3 / 5
తర్వాత మసాలా పేస్ట్ తయారీకి అదే పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసి కరిగిన తర్వాత, మూడు లవంగాలు, వన్ ఇంచ్ చెక్క, రెండు యాలకులు, ఒక బిర్యానీ ఆకు, ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, ఐదు లేదా ఆరు జీడిపప్పులు వేసి లైట్‌గా వేయించుకోండి. తర్వాత, మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, మూడు పచ్చిమిర్చి వేసి మెత్తబడే వరకు వేయించాలి. తర్వాత మీడియం సైజు రెండు టమాటా ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చి, బిర్యానీ ఆకుతో సహా మిక్సీ జార్‌లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

4 / 5
చివరి దశలో, అదే పాన్‌లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, కాగిన తర్వాత చిన్న ముక్కలుగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసి రెండు నిమిషాలు వేయించుకోండి తర్వాత అప్పం పేస్ట్ వేసి వేయించండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని వేసి, లోటు మీడియం ఫ్లేమ్‌లో ఆయిల్ పైకి తేలే వరకు బాగా వేయించుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత, అర టీ స్పూన్ పసుపు, ఒకటిన్నర టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, అర టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి, లో ఫ్లేమ్‌లో అన్ని బాగా కలిసేలా కలుపుకోండి.

5 / 5
ఇప్పుడు రెండు కప్పుల నీళ్లు పోసి, మీ రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోండి. తరువాత, వేయించి పెట్టుకున్న మీల్ మేకర్ ను వేసి కలిపి, మూత పెట్టి లోటు మీడియం ఫ్లేమ్‌లో మూడు నుండి నాలుగు నిమిషాలు ఉడికించండి. తర్వాత మూత తీసి, ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్, ఒక టీ స్పూన్ కసూరి మేతి, మరొక టేబుల్ స్పూన్ బటర్ వేసి బాగా కలుపుకోండి. మళ్లీ మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఆయిల్ పూర్తిగా పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే మీ రుచికరమైన మీల్ మేకర్ మసాలా కర్రీ సిద్ధం అయినట్టే.

Loading...
Unable to load recommendations.
Follow Us