
రాత్రి 7 నుండి 8 గంటల నిద్ర తర్వాత ఉదయానికి శరీరంలో స్వల్పంగా నీటిశాతం తగ్గుతుంది. కొబ్బరినీళ్లలో 94శాతం కంటే ఎక్కువ నీటిశాతం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరంలో వేగంగా ఇంకి, కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను భర్తీ చేస్తాయి. ఉదయాన్నే కేఫిన్ ఉన్న టీ, కాఫీలకు బదులుగా కొబ్బరినీళ్లు తాగడం అద్భుతమైన ప్రత్యామ్నాయం.

పరగడుపున కొబ్బరినీళ్లు తాగడం వల్ల అందులోని సహజ ఎంజైమ్లు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. ఇవి కడుపులో ఎసిడిటీ, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను నయం చేస్తాయి. రోజంతా జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి ఇది తోడ్పడుతుంది.

కొబ్బరినీళ్లలో పుష్కలంగా ఉండే పొటాషియం శరీరంలోని సోడియం శాతాన్ని సమతుల్యం చేస్తుంది. ఇది అధిక రక్తపోటు కలిగిన వారికి ఎంతగానో మేలు చేస్తుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.

కొబ్బరినీళ్లు సహజమైన మూత్రవిసర్జన ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి. ఉదయాన్నే ఇవి తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్లు మూత్రం ద్వారా బయటకు పోతాయి. ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. కొబ్బరినీళ్లలోని సహజ డయాబెటిక్ గుణాలు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తాయి.

దీనిలోని యాంటీఆక్సిడెంట్లు, టిశాతం చర్మాన్ని తేమగా ఉంచుతాయి. ఎండ దెబ్బ వల్ల చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. ఎలాంటి ఆర్టిఫిషియల్ షుగర్స్ లేని సహజ గ్లూకోజ్ శరీరానికి రోజంతా కావలసిన శక్తినందిస్తుంది. ఎల్లప్పుడూ తాజా కొబ్బరినీళ్లను గది ఉష్ణోగ్రత వద్ద మాత్రమే తాగాలి. అతిగా చల్లగా ఉన్నవి లేదా ప్యాక్ చేసినవి తాగకపోవడమే మంచిది. రోజుకు 200 ml నుండి 500 ml వరకు తాగడం శ్రేయస్కరం.