Chiranjeevi: గీతా ఆర్ట్స్, చిరంజీవి మధ్య అసలేం జరుగుతోంది ??

| Edited By: Phani CH

Feb 16, 2024 | 1:43 PM

రీ ఎంట్రీ తర్వాత కొణిదెల బ్యానర్‌కే కట్టుబడిన చిరంజీవి.. ఈ మధ్యే బయటి నిర్మాతలకు డేట్స్ ఇస్తున్నారు. అంతా బాగానే ఉన్నా గీతా ఆర్ట్స్‌లో మాత్రం మెగాస్టార్ సినిమా వర్కవుట్ కావట్లేదు.. అసలేంటి ఈ మతలబు..? ఒకప్పుడు గీతా ఆర్ట్స్‌కు కంపౌండ్ హీరోగా ఉన్న చిరుతో అల్లు అరవింద్ ప్రాజెక్ట్ ఎందుకు సెట్ కావట్లేదు..? అవుతుందా.. అయితే ఎప్పుడు..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి జోరు చూసి అభిమానులు బాగా ఖుషీ అయిపోతున్నారు. హిట్టు ప్లాపులతో పనిలేకుండా వరస సినిమాలు చేస్తూనే ఉన్నారు మెగాస్టార్.

1 / 5
రీ ఎంట్రీ తర్వాత కొణిదెల బ్యానర్‌కే కట్టుబడిన చిరంజీవి.. ఈ మధ్యే బయటి నిర్మాతలకు డేట్స్ ఇస్తున్నారు. అంతా బాగానే ఉన్నా గీతా ఆర్ట్స్‌లో మాత్రం మెగాస్టార్ సినిమా వర్కవుట్ కావట్లేదు.. అసలేంటి ఈ మతలబు..? ఒకప్పుడు గీతా ఆర్ట్స్‌కు కంపౌండ్ హీరోగా ఉన్న చిరుతో అల్లు అరవింద్ ప్రాజెక్ట్ ఎందుకు సెట్ కావట్లేదు..? అవుతుందా.. అయితే ఎప్పుడు..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..

2 / 5
రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి జోరు చూసి అభిమానులు బాగా ఖుషీ అయిపోతున్నారు. హిట్టు ప్లాపులతో పనిలేకుండా వరస సినిమాలు చేస్తూనే ఉన్నారు మెగాస్టార్. వాల్తేరు వీరయ్యతో తన రేంజ్ ఇంకా తగ్గలేదని చూపించారు చిరు. ఇక ఇప్పుడు విశ్వంభర అనే సోషియో ఫాంటసీతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కుటుంబంతో పాటు ఫారెన్ టూర్‌లో ఉన్నారు చిరంజీవి.

3 / 5
చిరు వరస ప్రాజెక్ట్స్ సైన్ చేస్తున్నారు.. అంతా బాగానే ఉందిగా ఇంకేంటి అనుకోవచ్చు. కానీ ఇక్కడే ఫ్యాన్స్‌కు ఓ కోరిక అలాగే ఉండిపోయింది. పొలిటికల్ బ్రేక్‌కు ముందు కనీసం రెండు మూడేళ్లకోసారి గీతా ఆర్ట్స్‌లో చిరంజీవి సినిమా పక్కాగా వచ్చేది. చిరు కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్స్ గీతా ఆర్ట్స్‌లో వచ్చాయి. కానీ రీ ఎంట్రీ ఇచ్చాక.. ఈ కాంబినేషన్ ఇప్పటి వరకు కలవలేదు.

4 / 5
చిరంజీవితో హీరో, విజేత, పసివాడి ప్రాణం, ప్రతిబంధ్, మాస్టర్ లాంటి చాలా సినిమాలు నిర్మించారు అల్లు అరవింద్. ఇక ఆయన డిస్ట్రిబ్యూట్ చేసిన చిరంజీవి సినిమాలకు లెక్కే లేదు. అందులో ఇండస్ట్రీ హిట్స్ చాలానే ఉన్నాయి. అలాంటి కాంబో 2005లో వచ్చిన అందరివాడు తర్వాత రిపీట్ కాలేదు. చిరు రీ ఎంట్రీ ఇచ్చాక.. కొణిదెల బ్యానర్‌లోనే వరస సినిమాలు చేసారు.. చేస్తున్నారు కూడా.

5 / 5
ఖైదీ నెం 150, సైరా సొంత బ్యానర్‌లో చేసినా.. ఆచార్యను మ్యాట్నీతో, గాడ్ ఫాదర్‌ను సూపర్ గుడ్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మించారు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ. కనీసం ఇలాగైనా చిరంజీవి, గీతా ఆర్ట్స్‌లో సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. పైగా ఈ మధ్యే బాలయ్య సినిమాను కన్ఫర్మ్ చేసారు అల్లు అరవింద్. మరి బావా బామ్మర్దుల సినిమా ఎప్పుడొస్తుందో చూడాలిక.