తాజాగా హీరోయిన్ శృతికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకీ అది ఏమిటంటే? ఈ అమ్మడు మెగా స్టార్ ఫ్యామిలీకి లక్కీ హీరోయిన్ అంట, ఎందుకంటే అప్పటి వరకు ఫ్లాప్ సినిమాలతో సతమతం అవుతున్న మెగా హీరోలకు ఈ అమ్ముడు సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందిందంట. అలా వృతి మెగా ఫ్యామిలీకి లక్కీ హీరోయిన్ అయిపోయింది అంటున్నారు ఈ అమ్మడు ఫ్యాన్స్. అసలు విషయంలోకి వెళ్లితే..
శృతి హాసన్ గబ్బర్ సింగ్ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో జోడి కట్టింది. ఈ సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే పవన్ కళ్యాణ్‌కు కూడా అప్పటివరకు సరైన హిట్ లేకపోవడంతో, గబ్బర్ సింగ్‌తో సాలిడ్ హిట్ దక్కింది. ఈ మూవీ తర్వాత పవన్ వరసగా హిట్స్ అందుకుంటూ వచ్చారు.
అలాగే రామ్ చరణ్ సరసన ఎవడు సినిమాలో నటించి. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇదే కాకుండా పవన్ కళ్యాణ్‌తో గబ్బర్ సింగ్ తర్వాత వకీల్ సాబ్‌లో నటించి మరోసారి హిట్ అందుకుంది.
ఇక ఈ అమ్మడు మెగా స్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ మూవీతో చిరు కూడా మచి ఫామ్‌లోకి వచ్చారనే చెప్పాలి.
అదేవిధంగా ఈ అమ్మడు అల్లుఅర్జున్‌తో రేసు గుర్రం సినిమాలో, రవితేజ బలుపు, క్రాక్ సినిమాలో , ప్రభాస్‌తో సలార్, బాలయ్యతో వీర సింహ రెడ్డి, మహేష్ తో శ్రీమంతుడు చిత్రాల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ఇలా ఈ ముద్దుగుమ్మ మెగా ఫ్యామిలీకి లక్కీ హీరోయిన్ అయిపోయింది అంటున్నారు తన ఫ్యాన్స్.