మహేష్ బాబు, సౌందర్య కాంబోలో మిస్సైన ఇండస్ట్రీ హిట్ మూవీ ఇదే!

Updated on: Apr 21, 2026 | 11:32 AM

చిత్ర పరిశ్రమలో ఒకరి కోసం రాసిన కథను మరో హీరో చేయడం, ప్లాప్ అవుతుంది అనుకున్న మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడం, ఒక హీరోయిన్ పాత్రలో మరో హీరోయిన్‌ను తీసుకోవడం ఇలా చాలా సంఘటనలు జరుగుతుంటాయి. కొన్ని సార్లు ఇలా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే వారణాసి మూవీతో వరల్డ్ వైడ్‌గా రికార్డ్ క్రియేట్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు మహేష్ బాబు. ఈక్రమంలోనే ఈ హీరోకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట ట్రెండ్ అవుతుంది. అది ఏమిటంటే? అందాల తార, నటి దివంగత సౌందర్య , మహేష్ బాబు కాంబోలో ఓ సినిమా మిస్ అయ్యిందంట. ఇంతకీ ఆ మూవీ ఏదో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన బాలనటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి, తన నటనతో ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్నాడు. రాజకుమారుడు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

2 / 5
ఇక మంచి హైట్, అందంగా ఉండటం, అంతే కాకుండా నటనపరంగా కూడా చాలా అద్భతంగా నటించడం, సూపర్ స్టార్ కృష్ణకావడంతో ఈ హీరోతో సినిమా చేయాలని చాలా మంది డైరెక్టర్స్ ఆసక్తి చూపేవారంట. ఈ క్రమంలోనే ఏస్వీ కృష్ణా రెడ్డి మహేష్ బాబు కోసం ఓ అందమైన కథను రెడీ చేశాడంట. అంతే కాకుండా సౌందర్య, మహేష్ బాబు కాంబోలో ఈ సినిమా రావాల్సి ఉండేనంట. కానీ చివరికి ఆ సినిమా నుంచి మహేష్ తప్పుకున్నారు.

3 / 5
ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో తెరకెకకిన యమలీల మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అయితే దర్శకుడు ముందుగా ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలి అనుకున్నాడంట.  అంతే కాకుండా హీరోయిన్‌గా సౌందర్య చేయాలి అని ఈ కథను ప్రిపేర్ చేసుకొని కృష్ణగారికి వినిపించారంట.

4 / 5
అయితే కథ విన్న కృష్ణ గారు ఈ మూవీ మహేష్ చేయడు అని చెప్పేశాడంట. వయసు చిన్నది అంతే కాకుండా అంత పెద్ద కథను హ్యాండిల్ చేయడం కష్టతరం అవుతుంది. అనవసరంగా రిస్క్ తీసుకోవడం వద్దూ అని చెప్పాడంట. అంతే కాకుండా అప్పటికే మహేష్ బాబు వయసు 19 సంవత్సరాలు, సౌందర్య వయసు 22 సంవత్సరాలు. వీరిద్దరికి ఏజ్ గ్యాప్ ఉండటం, కథ పెద్దగా ఉండటంతో వీరితో కాకుండా, వేరే వారితో ఈ సినిమా తీయమని సలహా ఇచ్చాడంట.

5 / 5
దీంతో దర్శకుడు యమలీల సినిమాను అలీ, ఇంద్రజలతో తీసి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఈ మూవీలో అలీ, ఇంద్రజ హీరో హీరోయిన్లుగా నటించారు. కైకాల సత్యనారాయణ యమడు పాత్రలో నటించారు. ఈ మూవీతో అలీకి మంచి గుర్తింపు రావడమే కాకుండా చాలా సినిమాల్లో నటించాడు. అలాగే మమేష్ బాబు, సౌందర్య కాంబోలో యమలీల మూవీ మిస్ అయ్యింది.

Follow Us