ఈ సంక్రాంతి టాలీవుడ్‌కు మోర్ అండ్ మోర్ స్పెషల్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. సాధారణంగా ఎంత పెద్ద సీజన్ అయినా రిలీజ్ అయిన అన్ని సినిమాలు భారీ వసూళ్లు సాధించటం కష్టం. కానీ ఈ సంక్రాంతి మాత్రం ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. రిలీజ్ అయిన అన్ని సినిమాలు బిగ్ నెంబర్స్‌ను రికార్డ్ చేసి టాలీవుడ్ స్క్రీన్‌కు కొత్త జోష్ తీసుకువచ్చాయి.
గేమ్ చేంజర్‌తో సిల్వర్ స్క్రీన్ మీద సంక్రాంతి సందడి మొదలు పెట్టారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. జనవరి 10న రిలీజ్ అయిన ఈ సినిమా డివైడ్ టాక్‌తో మొదలైనా... వసూళ్లు పరంగా సత్తా చాటింది. తొలి రోజే 186 కోట్ల మార్క్‌ను టచ్ చేసింది. దీంతో సంక్రాంతి బోణి బాగుందని హ్యాపీగా ఫీల్ అయ్యారు మూవీ లవర్స్.
పండుగ బరిలో సెకండ్ ఎంట్రీగా వచ్చిన సినిమా డాకు మహారాజ్. బాలయ్య హీరోగా బాబీ దర్శకత్వంలో స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాలయ్య గత చిత్రాలతో పోలిస్తే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచిన డాకు మహారాజ్, నాలుగు రోజుల్లోనే 100 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది.
పొంగల్ బరిలోకి లేటుగా వచ్చినా,... లేటెస్ట్‌గా వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం మూడు రోజుల్లోనే వంద కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది.