
ప్రస్తుతం థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలు అటు నెల రోజుల్లోనే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఓ క్రేజీ హిట్ మూవీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సందడి చేసేందుకు సిద్ధమయ్యింది. స్టార్ హీరో హీరోయిన్స్, గ్లామర్ పాటలు, యాక్షన్ సీన్స్ ఏమీ లేవు. అయినా ఈ సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. చిత్రపరిశ్రమలో విభిన్నమైన కథాంశంతో తెరకెక్కే సినిమాలకు ఎప్పుడూ విశేష ఆదరణ లభిస్తూనే ఉంటుంది.

ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులు, సినీ ప్రముఖుల నుంచి భారీ ప్రశంసలు అందుకున్న మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 'బాలన్: ది బాయ్' (Balan: The Boy). ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీతో సంచలనం సృష్టించిన ప్రముఖ దర్శకుడు చిదంబరంఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ‘ఆవేశం’, ‘రోమాంచం’ లాంటి బ్లాక్‌బస్టర్స్ అందించిన జిత్తు మాధవన్ కథను అందించారు. ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమై ప్రశంసలు పొందిన ఈ చిత్రం, జూన్ 19న థియేటర్లలోకి వచ్చి మంచి విజయం సాధించింది.

ఇప్పుడు థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకున్న 'బాలన్: ది బాయ్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 దక్కించుకుంది. ఈ సైకలాజికల్ సర్వైవల్ డ్రామా జూలై 31, 2026 నుంచి డిజిటల్ మాధ్యమంలో ప్రసారం కానుంది. కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ఒకేసారి వీక్షకులకు అందుబాటులోకి రానుంది. ఓ సంక్లిష్టమైన గతం నుంచి తప్పించుకోవడానికి ఒక తల్లి తన కుమారుడితో కలిసి రహస్య జీవితం గడుపుతుంటుంది.

గుర్తింపు బయటపడకుండా ఉండేందుకు నిరంతరం పేర్లు, ప్రాంతాలు మరుస్తూ బతుకుతుంటారు. "నన్ను తప్ప ఎవరినీ నమ్మకూడదు" అనే సూత్రాన్ని కొడుకు 'బాలన్'కు నేర్పిస్తుంది. అయితే, అనుకోని పరిస్థితుల్లో తల్లి, కొడుకు విడిపోతారు. కొడుకు తన తల్లిని వెతుక్కుంటూ సాగించే ప్రయాణంలో ఎదుర్కొనే సంఘటనలు, ఊహించని మలుపులు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. సస్పెన్స్, మదర్ ఎమోషన్, సైకలాజికల్ ఎలిమెంట్స్ కలగలిపి దర్శకుడు ఈ చిత్రాన్ని సీటు అంచులపై కూర్చోబెట్టేలా మలిచారు.

ఇందులో ఫర్జానా పాలతింగల్ ,అధిశేషన్, మహమ్మద్ జినాన్ కీలక పాత్రల్లో నటించారు. స్టార్ హీరో టొవినో థామస్ కీలకమైన అతిథి పాత్రలో మెరిసి ప్రేక్షకులను అలరించారు. ప్రసిద్ధ సంగీత దర్శకుడు సుశిన్ శ్యామ్ అందించిన నేపథ్య సంగీతం (BGM) సినిమా థ్రిల్లింగ్ అనుభూతిని రెట్టింపు చేసింది. థియేటర్లలో ఈ థ్రిల్లర్ మిస్ అయిన వారు, సస్పెన్స్ అండ్ మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్ ఇష్టపడే సినీ ప్రియులు జూలై 31 నుంచి ZEE5 లో ఈ చిత్రాన్ని చూడొచ్చు.